దేశీయ స్టా్క్ మార్కెట్ వరుస నష్టాల్లో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలు కారణంగా సూచీలు అప్రమత్తత పాటిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా దాదాపు రూ.13 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు తెలుస్తోంది. ఇక గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికి లాభాల్లోకి వచ్చినట్లే వచ్చి తిరిగి నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 77, 580 దగ్గర ముగియగా.. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 23, 532 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా తగ్గి రూ.84.40 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Alexei Zimin: రష్యా సెలిబ్రిటీ చెఫ్, పుతిన్ విమర్శకుడు అనుమానాస్పద మృతి..
నిఫ్టీలో హెచ్‌యుఎల్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్, నెస్లే, బ్రిటానియా నష్టాల్లో కొనసాగగా.. ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభపడ్డాయి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ఎన్డీఏ పాలనతో మహారాష్ట్ర నుంచి 5లక్షల ఉద్యోగాలు తరలిపోయాయి
గురు నానక్ జయంతి సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలు నాలుగు రోజులే పనిచేశాయి. తిరిగి సోమవారమే కార్యకలాపాలు జరగనున్నాయి.