జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ జయకేతనం ఎగురవేసింది. జేఎంఎం కూటమి 56 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో 81 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 41 దాటుకుని విజయం సాధించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. ఊహించని ఫలితాలను సాధించింది. ఏకపక్షంగా మహాయుతి కూటమి పక్షాన ప్రజలు నిలబడ్డారు. ఇక ఎన్సీపీ అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భారీ విజయం సాధించారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపై సోరెన్ విజయం సాధించారు. సెరైకెలా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి గణేష్ మహాలీపై చంపై 20,447 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రియాంకాగాంధీ ఆనందం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో వయనాడ్ ప్రజల గొంతుకనవుతానని ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి జేఎంఎం పార్టీ జయకేతనం ఎగరేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను 41 మ్యాజిక్ ఫిగర్ దాటుకుని 57 స్థానాల్లో దూసుకుపోయింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరు నెలలకు ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఉవ్వెత్తున ఎగిసిపడింది. మహారాష్ట్రలో అత్యధిక లోక్‌సభ సీట్లను సొంతం చేసుకుంది. 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో కాంగ్రెస్ 13, ఉద్ధవ్ థాకరే పార్టీ 9, శరద్ పవార్ పార్టీ 8 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది.
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 4 లక్షలకు పైగా మెజార్టీతో ఆమె గెలుపొందారు. తాజాగా ప్రియాంక విక్టరీపై భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు.
లండన్‌లో అమెరికా రాయబారి కార్యాలయం దగ్గర అనుమానాస్పద ప్యాకేజీ తీవ్ర కలకలం రేపింది. దీంతో యూకే పోలీసులు అప్రమత్తమై శుక్రవారం ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది. మరోవైపు గాట్విక్ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన మరొకటి జరిగింది. దీంతో ఎయిర్‌పోర్టు దక్షిణ టెర్మినల్‌ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. […]
ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 16న నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తొలుత ప్రధాని మోడీ నైజీరియాలో పర్యటించారు.