వారిద్దరూ పైలట్లు.. ట్రైనింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. అలా రెండేళ్ల నుంచి ఇద్దరి మధ్య బంధం కొనసాగుతోంది. ఆమెకు నాన్-వెజ్ అంటే ఇష్టం.. అతడికేమో వెజ్ అంటే ఇష్టం. కానీ అదే వారిని బద్ద శత్రువులుగా చేసింది. చివరికి ఒకరి ప్రాణం తీసింది.
ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్ ఢిల్లీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు రాజీనామా లేఖను పంపించారు. ఇటీవలే కైలాష్ గహ్లోత్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు కారణంగా ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పడింది. గత కొద్ది రోజులుగా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో అట్టుడికాయి. క్షిపణి, బాంబు దాడులతో రెండు దేశాలు దద్దరిల్లాయి. మొత్తానికి అమెరికా జోక్యంతో కాల్పులకు ఫుల్స్టాప్ పడింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేసినట్లు ఉదయం నుంచి వార్తలు హల్చల్ చేశాయి.
ఆదాయపు పన్ను శాఖకు చెందిన పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
టర్కీలో రష్యన్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం టర్కీలోని అంటాల్య ఎయిర్‌పోర్టులో సుఖోయ్ సూపర్జెట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.
పశ్చియాసియాకు మంచి రోజులు రాబోతున్నాయి. గత కొద్ది రోజులుగా బాంబుల మోతలు, రాకెట్ల దాడులతో యుద్ధ భూమి దద్దరిల్లింది. రక్తం ఏరులైపారింది. ఆస్తులు నేలమట్టం అయ్యాయి. సర్వం కోల్పోయి ప్రజలు దిక్కులేనివారయ్యారు. ఈ మారణహోమాన్ని మరింత సాగదీయకుండా ముగింపు పలకాలని నిర్ణయానికి వచ్చాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ అవుతారని వ్యాఖ్యానించారు.
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా విడిచిపెట్టి వెళ్లిపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.