ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఉధృతం అయింది. గత రాత్రి ఉక్రెయిన్‌పై అణు రహిత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించింది. రెండేళ్ల యుద్ధంలో ఇలాంటి క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి-పీటీ ఉపాద్యాయుడు మధ్య తీవ్ర ఫైటింగ్ జరిగింది. ఇద్దరూ కొట్టుకుంటుండగా విద్యార్థి తల్లి, సోదరి కూడా రంగంలోకి దిగి ముష్టి యుద్ధానికి దిగారు.
వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఓటీటీ ప్రియులకు ప్రసార భారతి అదిరిపోయే శుభవార్త చెప్పింది. మన దేశంలో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఎలాంటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఇంట్లోనే కూర్చుని.. కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ఓటీటీ ఇప్పుడు మంచి ప్లాట్‌ఫామ్.
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ కనిపించడం లేదంటూ హర్యానాలోని జులానా నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మమతా బెనర్జీ ప్రభుత్వంలో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ ప్రభుత్వాస్పత్రిలో అప్పుడే పుట్టిన పసికందును ఓ కుక్క నోటితో కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాలో చోటుచేసుకుంది.
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కళ్ల ముందు ఉన్నవారే ఉన్నట్టుండి మాయమైపోతున్నారు. ఇటీవల కర్ణాటకలో ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ ఫూల్లోకి ఈత కొట్టడానికి దిగి.. ఊపిరాడక కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు.
ఏదైనా కంపెనీలో ఉద్యోగం అంటే ఐదంకెల జీతం.. వగేరా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక ఆయా కంపెనీల్లో ఖాళీలు ఉంటే వాంటెడ్ పోస్టులు అంటూ ప్రకటనలు ఇస్తారు. ఇదేంటో గానీ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం వింతైన జాబ్ ఆఫర్ చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ నష్టాలను చవిచూసింది. మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమై గ్రీన్‌లో ముగిసింది. మళ్లీ ఒక్కరోజులేనే ఆ ఉత్సాహం ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు.. అదానీ గ్రూప్‌పై అమెరికా ఎఫ్‌బీఐ చేసిన ఆరోపణలతో మార్కెట్ కుదేలైంది.