INDIA Bloc: 6 నెలల్లో ఎంత మార్పు.. లోక్‌సభలో అదుర్స్.. అసెంబ్లీలో తుస్!
- 6 నెలల్లో ఇండియా కూటమిపై ఎంత మార్పు
- లోక్‌సభలో మెరుపులు.. అసెంబ్లీలో తుస్!
- మహారాష్ట్రలో 54 సీట్లకే పరిమితమైన కూటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరు నెలలకు ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఉవ్వెత్తున ఎగిసిపడింది. మహారాష్ట్రలో అత్యధిక లోక్‌సభ సీట్లను సొంతం చేసుకుంది. 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అందులో కాంగ్రెస్ 13, ఉద్ధవ్ థాకరే పార్టీ 9, శరద్ పవార్ పార్టీ 8 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ కూటమికి గట్టి షాకిచ్చింది. మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక బూస్టింగ్‌లాంటిదని కూటమి భావించింది. అధికారం కోసం ఎన్నో కలలు కంది. లోక్‌సభలో వచ్చిన ఉత్సాహమే.. అసెంబ్లీలో కూడా అదే తరహాలో ఉంటుంది అని కాంగ్రెస్ కూటమి భావించింది. తీరా ఆరు నెలలు తిరిగేసరికి అంతా తుస్‌మని పోయింది. తాజాగా విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో బొమ్మ.. బొరుసైంది. మహా వికాస్ అఘాడీ కూటమి భారీ ఓటమిని కూడగట్టుకుంది. 288 స్థానాలు ఉండగా కేవలం 54 స్థానాలతో ఇండియా కూటమి సరిపెట్టుకుంది. ఇక మహాయుతి కూటమి(ఎన్డీఏ) ఏకంగా 227 స్థానాలు గెలుచుకుని తిరుగులేని శక్తిగా నిలిచింది.
ఇది కూడా చదవండి: Ajay Dhishan: ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. కానీ విలన్ గా?
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
తాజాగా విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పండితులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఆరు నెలల్లో ప్రజల్లో ఎంత మార్పు అంటూ సంభాషించుకుంటున్నారు. గరిష్ట స్థాయి నుంచి కనిష్ట స్థాయికి ఇండియా కూటమి పడిపోయిందని గుసగుసలాడుకుంటున్నారు. ఇక శరద్‌పవార్(83) ఇప్పటికే రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 2026లో శరద్ పవార్ రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. అనంతరం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ఉద్ధవ్ థాకరే పార్టీ కూడా భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొంది. తాజా ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు. మహారాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమిని విశ్వసించారు. దాదాపు 288 సీట్లకు గాను 227 సీట్లను మహాయుతి కూటమికి కట్టబెట్టి తిరుగులేని శక్తిగా నిలిపారు.
ఇది కూడా చదవండి: Divorce Temple: విడాకుల నిర్ణయం తీసుకునే ఆలయం ఎక్కడుందో తెలుసా?
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?