టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ప్రైవేటు కంపెనీలు భారీగా ధరలు పెంచేయడంతో మళ్లీ కస్టమర్ల బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ధరలు పెరగలేదు.
అదానీ గ్రూప్ లంచాల వ్యవహారం భారతదేశాన్ని కుదిపేస్తోంది. అమెరికా చేసిన ఆరోపణలు ప్రస్తుతం పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక గురువారమైతే మార్కెట్ షేర్లు అన్నీ భారీగా పడిపోయాయి.
అమెరికాలోని కాలిఫోర్నియా బీచ్‌లో ఒక అరుదైన చేపను రీసెర్చ్ స్కాలర్ కనుగొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పీహెచ్డీ అభ్యర్థి షేర్ చేశాడు. ‘ఓర్ఫిష్’ లేదా ‘డూమ్స్‌డే ఫిష్’గా పిలిచే ఈ చేప చాలా అరుదైందిగా పేర్కొన్నాడు.
రాజస్థాన్‌లో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయేది. పోలీసుల అప్రమత్తతతో యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన జుంజును జిల్లాలో చోటుచేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో 10 మంది మావోయిస్టులను భద్రతా సిబ్బంది అంతమొందించాయి. 10 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచిన ఓలా కంపెనీ ఉద్యోగులకు షాకిచ్చింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఎంప్లాయిస్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కె్ట్కు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ముందు సరికొత్త జోష్ వచ్చింది. గత ఐదు నెలల్లో ఎన్నడూ చూడని విధంగా సూచీలు రాకెట్లా దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చాయి.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరిగాయి. అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్ని సర్వేల్లోనూ ఎన్డీఏ కూటమిదే విజయమని తేల్చాయి. అయితే ఈ సర్వేలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.