బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్.. నలుగురు చేతుల్లో బందీగా ఉన్నారని ఆరోపించారు.
రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం శనివారం అశోక్ గెహ్లాట్ పదవీకాలంలో ఏర్పాటైన తొమ్మిది జిల్లాలు, మూడు డివిజన్లను రద్దు చేసింది.
లడఖ్‌లోని పాంగోంగ్ త్సో దగ్గర 30 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 30 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం మరాఠా యోధుడి యొక్క వారసత్వాన్ని గౌరవించేలా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ ప్రతీకార దాడులకు శ్రీకారం చుట్టింది. పాక్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
కజకిస్థాన్ విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాపణ చెప్పారు. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్.. రష్యాపై ఆరోపణలు చేసింది.
ముంబైలో హీరోయిన్ ఊర్మిళ కొఠారే కారు శుక్రవారం రాత్రి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మెట్రో ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కార్మికుడు మృతిచెందాడు. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఊర్మిళా కొఠారే డ్రైవర్ కారును అత్యంత వేగంగా నడిపాడని పోలీసులు పేర్కొన్నారు.
నేటి తరం పిల్లల తీరుపై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుతున్నా.. భవిష్యత్ గురించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆప్ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారం మరోసారి హీటెక్కుతోంది. ఎన్నికల ముంగిట ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.