కజకిస్థాన్ విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాపణ చెప్పారు. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్.. రష్యాపై ఆరోపణలు చేసింది. తాజాగా ఈ ఘటనపై పుతిన్ స్పందించి క్షమాపణ చెప్పారు. అజర్‌బైజాన్ దేశాధినేత ఇల్హామ్ అలీయేవ్‌కు క్షమాపణలు కోరారు.
విమానం… అజర్ బైజాన్‌లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా హఠాత్తు పరిణామాలు ఎదురయ్యాయి. కజకిస్థాన్‌లో ల్యాండింగ్ సమయంలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా.. 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన రోజున ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు గ్రోజ్ని సమీపంలో రష్యా క్షిపణులను ప్రయోగించింది. ఆ క్షిపణుల్లో ఒకటి విమానాన్ని తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. రష్యా క్షిపణి తాకడం కారణంగా విమానం కూలిందంటూ ఉక్రెయిన్‌తో పాటు అజర్ బైజాన్ కూడా ఆరోపించింది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్.. అజర్ బైజాన్ దేశాధినేత ఇల్హామ్ అలీయేవ్‌కు క్షమాపణలు చెప్పారు. పుతిన్ క్షమాపణతో ప్రాధానత సంతరించుకుంది.
రష్యా గగనతలంలో సంభవించిన విషాద సంఘటనకు పుతిన్ క్షమాపణలు చెబుతూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ మరియు హృదయపూర్వక సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.