Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్నినల్-2 తాత్కాలికంగా మూసివేత.. కారణమిదే!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్నినల్-2 తాత్కాలికంగా మూసివేత
- నాలుగు నుంచి 6 నెలల పాటు తాత్కాలికంగా క్లోజ్
- ప్రయాణికులకు అసౌకర్యం కలుగవచ్చన్న ఎయిర్‌పోర్ట్ సంస్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) సీఈవో విదేహ్ కుమార్ జైపురియార్ తెలిపారు. పునరుద్ధరణ పనుల కోసం టెర్మినల్-2 మూసివేస్తున్నట్లు వెల్లడించారు. పునరుద్ధరణ పనులు 2025-26లో ప్రారంభమై.. ఆరు నెలల్లో ముగిస్తాయని అంచనా వేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Hyderabad: గోషామహల్లో మరోసారి కుంగిన చాక్నావాడి నాళా..
Also Read
టెర్మినల్-2 నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ 1,300 విమానాల రాకపోకలు సాగిస్తుంటాయి. పునరుద్ధరణ పనుల కోసం నాలుగు నుంచి ఆరు నెలల పాటు మూసివేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తి కానున్నాయి. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ఇక్కడ టెర్మినల్-1, టెర్మినల్-2, టెర్మినల్-3 ఉన్నాయి. టెర్మినల్-1, 2 దేశీయ విమానాలకు ఉపయోగిస్తున్నారు. అయితే టెర్మినల్-2 ప్రారంభమై దాదాపు 40 సంవత్సరాలు గడుస్తుంది. ప్రస్తుతం పరిస్థితులకు తగ్గట్టుగా చేయాలని భావిస్తోంది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2025 నుంచి పనులు ప్రారంభం అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే టెర్మినల్-2 మూసివేత కారణంగా కార్యకలాపాలకు అంతరాయం కలగవచ్చని భావిస్తున్నారు. ఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్-1పై అధిక భారం పడే అవకాశం ఉంది. ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Vishal : హీరో విశాల్ హెల్త్ కండీషన్ పై స్పందించిన స్టార్ హీరో..ఏమన్నారంటే ?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు