తిరుపతి తొక్కిసలాట ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి సమయంలో ప్రతి ఏటా భద్రత కల్పిస్తారు. కానీ ఈసారి మాత్రం భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.
రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలి..
మృతుల కుటుంబాలకు రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. టీటీడీ అధికారుల నుంచి, ప్రభుత్వ పెద్దలంతా ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. వందలాది మంది భక్తులు వస్తారన్న తెలిసికూడా భద్రత కల్పించలేదని ఆరోపించారు. ఆరుగురు చనిపోగా.. 60 మందికి గాయాలయ్యాయన్నారు. తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇంత దారుణంగా వ్యవస్థ మారిపోయిందని జగన్ ధ్వజమెత్తారు.