Esther Anuhya Case: ఎస్తేర్ అనూహ్య హత్యాచార కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. చేతులెత్తేసిన పేరెంట్స్
- ఎస్తేర్ అనూహ్య హత్యాచార కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటించిన సర్వోన్నత న్యాయస్థానం
- చేతులెత్తేసిన వృద్ధ తల్లిదండ్రులు.. కోర్టుతో పోరాడే శక్తి లేదని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) హత్యాచార కేసులో నిజం ఓడిపోయింది. అబద్ధం గెలిచింది. తాజాగా ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరిచింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ కీలక తీర్పు వెలువరించింది. దీంతో బాధిత కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుపై పోరాడే శక్తి తమకు లేదని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
విజయవాడకు చెందిన ఎస్తేర్ అనూహ్య.. ముంబైలో టాటా కన్సల్టెన్సీ్ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. అయితే క్రిస్మస్ సెలవుల కోసం 2013, డిసెంబర్‌లో స్వస్థలం విజయవాడకు వచ్చింది. తిరిగి రెండు వారాలు తర్వాత.. విజయవాడ నుంచి లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ముంబైకి బయల్దేరి వెళ్లింది. ఎంతో సంతోషంగా తల్లిదండ్రులు.. కుమార్తెను సాగనంపారు. జనవరి 5, 2014న లోకమాన్య తిలక్ టెర్మినస్ స్టేషన్‌లో దిగింది. సీసీకెమెరాలో కూడా రికార్డ్ అయింది. అనంతరం అక్కడే ఉన్న చంద్రభాన్ సనప్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పరిచయం చేసుకుని లగేజీ తీసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. తీరా.. క్యాబ్ దగ్గరకు తీసికెళ్లాక బైక్ ఎక్కించుకునే ప్రయత్నం చేయగా ఆమె నిరాకరించింది. మొత్తానికి ఆమెను ఒప్పించి బైక్ ఎక్కించుకుని వెళ్లాడు. అప్పటి నుంచి ఎస్తేర్ ఫోన్ పనిచేయకుండా పోయింది. దీంతో భయాందోళన చెందిన తల్లిదండ్రులు.. ముంబైకి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గాలింపు చేపట్టారు. చివరికి 10 రోజుల తర్వాత 2014, జనవరి 16న ముంబైలోని కంజుర్‌మార్గ్‌లో కుళ్లినస్థితిలో మృతదేహం కనిపించింది. పోలీసులు.. పేరెంట్స్‌ను తీసుకొని వచ్చి చూపించగా మృతదేహం ఎస్తేర్ అనూహ్యదేనని తేలడంతో నిశ్చేష్టులయ్యారు. ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు.
Also Read
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
ఇది కూడా చదవండి: Varalaxmi: మరో తెలుగు సినిమాకి వరలక్ష్మీ గ్రీన్ సిగ్నల్?
అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి సీసీకెమెరాలు జల్లెడ పట్టగా… చంద్రభాన్ సనప్‌గా స్థానిక ప్రజలు, డ్రైవర్లు తేల్చిచెప్పారు. మార్చి 3న నాసిక్‌లో నిందితుడు చంద్రఖాన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు.. ఎస్తేర్‌ను ఒప్పించి బైక్ మీద తీసుకెళ్తుండగా మార్గమధ్యలో పెట్రోల్ అయిపోయిందని అబద్ధం ఆడి బైక్ ఆపాడు. అనంతరం ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆమె ఎదురుతిరగడంతో బండరాయితో మోది చంపేశాడు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశాడు. ఆమెకు చెందిన ల్యాప్‌టాప్, వస్తువులను పట్టుకుని వెళ్లిపోయాడు.
ఇక అక్టోబర్ 2015లో ఎస్తేర్ హత్యాచార కేసులో చంద్రఖాన్ సనప్‌ను ముంబై కోర్టు దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. శిక్షను ఖరారు చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి వృశాలి జోషి మాట్లాడుతూ.. ఇది అత్యంత అరుదైన కేసు అని, మరణశిక్షకు అర్హత సాధించిందన్నారు. ‘‘ఈ కేసు అరుదైన కేటగిరీ కిందకు వస్తుంది, కాబట్టి నిందితుడికి మరణశిక్ష విధించబడింది. అతను చనిపోయే వరకు అతని ఉరి వేయాలి’’ అని న్యాయమూర్తి తీర్పు వెలవరించారు. ఆ తర్వాత బొంబాయి హైకోర్టు కూడా మరణశిక్షను సమర్థించింది. అలాంటి వ్యక్తి సమాజానికి పెనుముప్పుగా మిగిలిపోతాడని, ఈ నేరానికి మరణశిక్ష తప్పదని హైకోర్టు పేర్కొంది.
అయితే ముంబై కోర్టు తీర్పుపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో చంద్రఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. దోషిగా నిర్ధారించడానికి ప్రాసిక్యూషన్ సాక్ష్యం సరిపోదని తాజాగా సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. సరైన ఆధారాలు లేవని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
సుప్రీంకోర్టు తీర్పుపై ఎస్తేర్ తండ్రి జోనాథన్ ప్రసాద్ నిరాశ చెందారు. సుప్రీంకోర్టు ఆర్డర్ గురించి విన్నానని.. ఇక దాని గురించి ఏమీ చేయలేమని తెలిపారు. ఏం జరుగుతుందో తమకు తెలియదని పేర్కొన్నారు. నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలియదని చెప్పారు. ఈ కేసును దేవుడికి వదిలేస్తున్నట్లు చెప్పారు. 70 ఏళ్ల వయసులో న్యాయస్థానంతో పోరాడలేనని ఆవేదన చెందారు.
ఇది కూడా చదవండి: WhatsApp Governance: రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ సేవలు.. దేశంలోనే మొదటి సారి
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!