దక్షిణ కొరియాలోని అన్‌సియోంగ్‌లో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన హఠాత్తుగా కూలిపోయింది. కూలిపోయిన దృశ్యాలు డాష్ క్యామ్ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోగా.. చాలా మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. దీనిపై అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అధికారులు, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: IND vs PAK: భారత్, పాకిస్థాన్‌లను వేర్వేరు గ్రూపుల్లో వేయండి.. లేదా హాస్పిటల్ బిల్లులైన చెల్లించండి!
‘‘ఈ ఘటన సుమారు ఉదయం 9:49 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. హైవేపై నిర్మిస్తున్న బిడ్జి కూలిపోయింది. ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. జాతీయ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాం.’’ అని నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు దక్షిణంగా ఉన్న చియోనాన్ నగరానికి సమీపంలోని సియోబుక్-గులో ఈ సంఘటన జరిగింది.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై ఎనిమిది మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు చనిపోగా.. ఐదుగురు గాయపడినట్లు సమాచారం. సియోల్-సెజోంగ్ ఎక్స్‌ప్రెస్‌వేలోని అన్సాన్-యోంగిన్ సెక్షన్‌ను కలిపే వంతెన నిర్మాణ సమయంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. 164 అడుగుల (50 మీటర్లు) పొడవున్న ఐదు ఉక్కు స్తంభాలు వరుసగా కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: YS Jagan Pulivendula Tour: నేడు పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్
BREAKING: At least 3 construction workers killed, 5 injured after portion of highway overpass collapsed near Anseong, South Korea pic.twitter.com/7m0E8zktT4
— BNO News (@BNONews) February 25, 2025