Delhi: స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక.. అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోల తొలగింపుపై ఆప్ రగడ
- స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక
- అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోల తొలగింపుపై ఆప్ రగడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ అరవిందర్ సింగ్ లవ్లీ.. విజేందర్ గుప్తా.. స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ప్రతిపక్ష నేత అతిషి.. విజేందర్ గుప్తా సీటు దగ్గరకు వెళ్లి అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్ స్థానం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. స్పీకర్‌తో కలిసి ఫొటో దిగారు.
ఇది కూడా చదవండి: Anji Reddy Chinnamile: ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి..
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
ఇక 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సోమవారం తొలి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ అరవిందర్ సింగ్ లవ్లీ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా.. అనంతరం మంత్రులు.. ఎమ్మెల్యేలగా ప్రమాణం చేశారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఎన్నికలప్పుడే మోడీకి బీహార్ గుర్తొస్తుంది
ఇక స్పీకర్‌గా విజేందర్ గుప్తా సీటులో ఆశీనులయ్యాక.. ఆప్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అంబేద్కర్, భగత్ సింగ్ చిత్ర పటాలు తొలగించడంపై నిరసన వ్యక్తం చేసింది. బీజేపీ దళితులంటే గిట్టదు అనడానికి ఇదే ఉదాహరణ అని అతిషి ఆరోపించారు. బీజేపీ దళిత వ్యతిరేక, సిక్కు వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు.
స్పీకర్ విజేందర్ గుప్తా స్పందిస్తూ.. ‘‘ఇది మర్యాదపూర్వక ప్రసంగం. మీరు దీనిని రాజకీయ వేదికగా మార్చకూడదు. ప్రతిపక్షం సభ సజావుగా జరగాలని కోరుకోవడం లేదు. ఆప్ సభకు అంతరాయం కలిగించే ఉద్దేశంతో వచ్చింది. సభ గౌరవాన్ని కాపాడండి.’’ అని కోరారు. నిరసనల మధ్య సభను 15 నిమిషాలు స్పీకర్ వాయిదా వేశారు.
#WATCH | BJP MLA Vijender Gupta elected as the Speaker of the Delhi Legislative Assembly
CM Rekha Gupta and LoP in Delhi Assembly, Atishi, accompanied him to the Chair.
(Source: Delhi Assembly) pic.twitter.com/lfCwgjx3og
— ANI (@ANI) February 24, 2025
#WATCH | AAP MLAs protest inside Delhi Assembly. LoP Atishi alleged that pictures of Dr BR Ambedkar and Bhagat Singh have been removed from CM's office
Speaker Vijender Gupta says, "It was a courtesy address. You should not have made it a political platform. The opposition does… pic.twitter.com/yaPbP5gBeG
— ANI (@ANI) February 24, 2025
मैं विजेंद्र गुप्ता……
आज तीसरी बार दिल्ली विधान सभा के सदस्य के रूप में शपथ ग्रहण की। pic.twitter.com/OoNgcYVU6T
— Vijender Gupta (@Gupta_vijender) February 24, 2025
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!