తన ఆలోచనలు, వ్యూహాలు విజయ్‌కు అవసరం లేదని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెన్నై మామల్లపురంలో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రశాంత్ కిషోర్ హాజరై మాట్లాడారు. ‘‘విజయ్‌కు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం లేదు. గత నాలుగేళ్లుగా నేను ఎవరికి పనిచేయలేదు. కానీ నేను ఈ వేడుకకు రావడానికి కారణం నా బ్రదర్ విజయ్‌నే కారణం. టివీకే పార్టీ ఒక కొత్త రాజకీయ చరిత్రను తమిళనాడులో సృష్టించబోతుంది. తమిళనాడు మార్పు కోరుకుంటోంది. ఆ సమయం వచ్చింది. ఒక కొత్త రాజకీయాన్ని విజయ్ ప్రజలకు పరిచయం చేస్తారు. గత 35 ఏళ్లుగా ఉన్న రాజకీయాన్ని విజయ్ తన ఆలోచనలతో మార్పు తీసుకుని వస్తారు.’’ అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఇమ్రాన్ ఖాన్ వల్లే ఈ పరిస్థితి.. పీసీబీ మాజీ ఛైర్మన్ ఆగ్రహం!
‘‘విజయ్ అలోచనలు, సమాజంపై ఉన్న ప్రేమ, బాధ్యత నాకు తెలుసు. అందుకే విజయ్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చాను. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలిచిన తర్వాత నేను స్వయంగా తమిళంలో మాట్లాడి ప్రజలకు కృతజ్ఞతలు చెబుతాను. తమిళనాట అవినీతి, కుటుంబ పాలనా పోవాలంటే విజయ్ లాంటి వ్యక్తి రావాలి. దేశంలో ఎక్కడలేని విధంగా రాజకీయ అవినీతి తమిళనాడులో ఉంది. అవినీతి, కమ్యూనిజం, కుటుంబ పాలనా తమిళనాడులో పోవాలి. నా కంటే ధోనీకి తమిళనాడులో క్రేజ్ ఎక్కువ. కానీ వచ్చే ఎన్నికల్లో టీవీకే పార్టీని గెలిపించి ధోనీ కంటే ఎక్కవ క్రేజ్‌ను తమిళనాడులో నేను సంపాదిస్తాను. రానున్న రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ధోనీ గెలిపిస్తే… నేను విజయ్ ఆధ్వర్యంలో టీవీకే పార్టీనీ గెలిపిస్తాను. వచ్చే వంద రోజుల్లో టీవీకే పార్టీని పది ఇంతలు పటిష్టంగా కార్యకర్తలు మార్చాలి.’’ అని ప్రశాంత్ కిషోర్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: NBK : రీ – రిలీజ్ కు రెడీ అయిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార-ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇక కమల్‌హాసన్‌ను డీఎంకే దగ్గరకు చేర్చుకుంటుంది. ఆయన్ను రాజ్యసభకు పంపిస్తుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే తరపున కమల్ హాసన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Rebal Star : ప్రభాస్.. ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్..