కర్ణాటక రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న అవినీతి కేసులో విచారణను రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కర్ణాటక హైకోర్టు నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా మరియు రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Online Love Scam: ఇలా ఉన్నారేంట్రా బాబు.. వాట్సప్ లోనే పరిచయం.. ప్రేమ..పెళ్లి.. కాపురం!
న్యాయస్థానాల్లో కుమారస్వామికి ఉపశమనం లభించపోవడంతో కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు. కుమారస్వామిని విచారించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర పోలీసు శాఖ గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో కన్నడ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
బెంగళూరు దక్షిణ తాలూకాలోని ఉత్తరహళ్లి హోబీలోని హలగేవడేరహళ్లి గ్రామంలోని రెండు ప్లాట్లను కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక ఉద్దేశాలతో డీనోటిఫై చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. బీడీఏ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ… ముఖ్యమంత్రిగా కుమారస్వామి 2007లో ఆ భూమిని డీ-నోటిఫై చేయాలని ఆదేశించారని.. ఆ తర్వాత 2010లో ఆ భూమిని ప్రైవేట్ పార్టీలకు రూ.4.14 కోట్లకు విక్రయించినట్లుగా కాంగ్రెస్ ఆరోపించింది. అలాగే బళ్లారి జిల్లాలో శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్ మైనింగ్ కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే ఓ కేసు విచారణలో ఉన్నందున ఆయనను విచారించడానికి అనుమతి ఇవ్వాలని సిట్ బృందం రాజ్‌భవన్‌కు లేఖ రాసింది. అయితే చార్జ్‌షీట్ కన్నడలో ఉందని, ఆంగ్లంలోకి అనువదించి అందజేయాలని రాజ్‌భవన్ అధికారులు సూచించారు. దీంతో సుమారు 4,500 పేజీల చార్జ్‌షీట్‌ను ఇంగ్లీష్‌లోకి మార్చి సమర్పించారు. ఈ నేపథ్యంలో గరవ్నర్ అనుమతి ఇస్తే సిట్ అధికారుల ముందు కుమారస్వామి విచారణకు హాజరుకావలసి ఉంటుంది.
ఇది కూడా చదవండి: The EYE : వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శృతి హాసన్ హాలీవుడ్ సినిమా ‘ది ఐ’