ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ముగిసింది. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న అధికారికంగా కుంభమేళా ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా ఉత్సవం జరిగింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు.. దాదాపు 45 రోజులు నిర్వహించారు. దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రూ.3లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు కూడా నడిచాయి.
ఇది కూడా చదవండి: AP Budget 2025: బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్..
ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా కూడా ప్రయాగ్‌రాజ్‌కి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం ప్రయాగ్‌రాజ్‌లో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా సమయంలో రాని భక్తులంతా.. ఇప్పుడు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక అంచనాలు లేనప్పటికీ శుక్రవారం ఉదయం నుంచి త్రివేణి సంగమంలో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Realme P3x: నమ్మలేని ఫీచర్స్‌ను బడ్జెట్ రేంజ్‌లోకి తీసుకొచ్చిన రియల్‌మి
ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు సడలించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. దీంతో వాహనాల మీద నేరుగా ఘాట్‌ల దగ్గరకు చేరుకుంటున్నారు. ఇలా వేలాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 5 గంటల నాటికి ఘాట్‌లన్నీ భక్త జనసందోహంతో కనబడ్డాయి. చాలామంది బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు వచ్చారు. అంతేకాకుండా ప్రయాగ్‌రాజ్‌లోని చాలా మంది స్థానికులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. మహా కుంభమేళాకు హాజరు కాలేకపోయిన చాలా మంది యాత్రికులు ఇప్పుడు వస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: AP Assembly Budget Session 2025: ఏపీ బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్..