కుంభమేళా, అయోధ్య కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధాని మోడీ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కాంగ్రెస్‌పై బీజేపీ మాటల దాడి చేసింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ప్రాంతాన్ని కాంగ్రెస్ మంత్రులు వినోద ప్రాంగణంగా మార్చుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఎస్ఎల్బీసీ సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్.. హరీశ్‌రావు మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. అనారోగ్యంగో బాధపడుతున్న సుబ్బారావును ఎర్రవల్లిలోని తన నివాసానికి కేసీఆర్ ఆహ్వానించారు. దీంతో సుబ్బారావు దంపతులు.. కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సుబ్బారావు యోగ క్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది.
వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం నడిచింది. రష్యాతో యుద్ధం, అలాగే ఖనిజ ఒప్పందాలపై ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది.
కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో సగం జనాభా.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా జనాభా ఉన్నారని తెలిపారు. సగం జనాభా ఉన్న చోట ఒక్క మంత్రి కూడా లేడన్నారు.
ప్రపంచ ప్రజలు భారత్ వైపు చూస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్ఎక్స్టీ కాన్క్లేవ్లో మోడీ పాల్గొని ప్రసంగించారు. భారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్నాయని చెప్పారు. ప్రపంచం మొత్తం భారత్ గురించి ఆసక్తిగా గమనిస్తోందని వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార-ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ కూడా కదనరంగంలోకి దిగాడు. ఇటీవల టీవీకే పార్టీ రెండో ఆవిర్భావ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, విజయ్ పాల్గొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు.
పూణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి 25న (మంగళవారం) ఉదయం 6 గంటలకు అత్యంత రద్దీగా ఉండే పూణెలోని స్వర్గేట్ బస్సు డిపోలో యువతి(26)పై దత్తాత్రే రాందాస్ (36) అనే యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రతో పాటు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
వైట్‌హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర వాగ్యుద్ధానికి దిగారు. ఇందుకు ప్రపంచ మీడియా వేదిక అయింది. శాంతి చర్చలు సందర్భంగా ట్రంప్-జెలెన్ స్కీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది.