ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే టన్నెల్లో మట్టి తొలగిస్తేనే తప్ప పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ముమ్మరంగా కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
టిప్పు సుల్తాన్ వారసుడినని... ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లు కాజేసిన ఓ ప్రైవేట్ వైద్యుడిని జనగాం పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ సుల్తాన్ రాజ్.. టిప్పు సుల్తాన్ ట్రస్ట్ చైర్మన్‌గా చలామణి అవుతున్నాడు.
సృష్టిలో స్త్రీ, పురుషుల బంధం చాలా ప్రత్యేకమైంది. పెళ్లి అనే రెండు అక్షరాలతో అమ్మాయి-అబ్బాయి వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు. నాటి నుంచి ఒక కుటుంబంగా ఏర్పడతారు. భారతీయ సంస్కృతిలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటిది ఈ మధ్య జంటలు.. వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పార్లమెంట్ స్థానాలు పెరగాలంటే.. పెళ్లైన జంటలు త్వరత్వరగా పిల్లల్ని కనాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. త్వరలో కేంద్రం.. డీలిమిటేషన్ చేయబోతుంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని సూచించింది. అయితే కేంద్ర ప్రకటనపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణలో బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే విద్యార్థుల కూడా పుస్తకాలు ముందు వేసుకుని చదువుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల ఫీవర్ మొదలు కాబోతుంది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్టీవీతో హరీశ్‌రావు మాట్లాడారు. తమ హయాంలో ఎస్ఎల్బీసీ కోసం రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానన్నారు. తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.
భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను మోడీ పోస్టు చేశారు. ఇక గుజరాత్‌లోని మూడు రోజుల పర్యటన సందర్భంగా జునాగఢ్ జిల్లాలోని గిర్ అడవుల్లో మోడీ సపారీ చేశారు.
ప్రముఖ సామాజిక కార్యకర్ద మేధా పాట్కర్ హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. ఛాదర్‌ఘాట్ సమీపంలోని ఓ ఇంటికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మేధా పాట్కర్ ఉన్న ఇంటికి చేరుకున్నారు. మూసీ సుందరీకరణ పనులను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (23) హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. మార్చి 1న రోహ్తక్-ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో నర్వాల్ మృతదేహం లభ్యమైంది.
జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వ్యక్తిపై ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ మరణించాడు. గాబ్రియేల్.. కేరళలో రిక్షా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు