Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. 57 మంది సమాధి
- ఉత్తరాఖండ్‌లో హిమపాతం విలయతాండం
- హిమపాతంలో చిక్కుకుని 57 మంది మృతి
- శుక్రవారం అర్ధారాత్రి వరకు భారీ వర్షాలు ఉంటాయన్న ఐఎండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం చేసింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు భారీ హిమపాతం.. దీంతో ఉత్తరాఖండ్ అల్లాడిపోయింది. ఎటుచూసినా భారీగా మంచు పేరుకుపోయింది. చమోలి జిల్లాలో హిమపాతంలో చిక్కుకుని 57 మంది కార్మికులు సమాధి అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 10 మంది కార్మికులు మాత్రం సురక్షితంగా బయట పడినట్లు సమాచారం. వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Gorantla Madhav: చిక్కుల్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..! ఎస్పీకి టీడీపీ, జనసేన ఫిర్యాదు
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
రాష్ట్ర విపత్తు దళం (SDRF), జాతీయ విపత్తు దళం (NDRF), జిల్లా యంత్రాంగం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) బృందాలు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టారు. భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌తో సహా అనేక కొండ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం అర్థరాత్రి వరకు చాలా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే భారీ వర్షాలు కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీరుతో నిండిపోయాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు మూసేశారు. మరోవైపు రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా గత మూడు రోజులుగా వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. గత 12 గంటలుగా కుండపోత వర్షాలు, భారీ హిమపాతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా, లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 200 రోడ్లు మూసేశారు.
ఇది కూడా చదవండి: Earthquake: చెన్నైలో భూకంపం.. భయంతో జనాలు పరుగులు
#WATCH | Heavy snowfall continues near Mana in Chamoli district of Uttarakhand.
57 labourers engaged in snow clearance near Mana trapped after an avalanche hit the area. 10 labourers have been rescued; search and rescue mission for the remaining persons is underway.
(Video… pic.twitter.com/BpFHWVgXbA
— ANI (@ANI) February 28, 2025
#WATCH | Kullu, Himachal Pradesh | Visuals from Kullu district, where torrential rain in lower areas for the last 24 hours caused flash floods and landslides. Efforts to retrieve damaged vehicles are underway.
The administration has issued an alert to the people living in the… pic.twitter.com/5hhif7eaVm
— ANI (@ANI) February 28, 2025
Uttarakhand | Police Headquarters spokesperson IG Nilesh Anand Bharne tells ANI, "A massive avalanche has occurred near the Border Roads Organisation camp in the border area of Mana in which 57 workers engaged in road construction have been trapped. Out of these workers, 10… pic.twitter.com/5A6e1V7ncQ
— ANI (@ANI) February 28, 2025
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!