తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ దగ్గరకు ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు చేరుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ, ఇద్దరు పీజీ వైద్యులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే టెన్నల్ దగ్గర ఇప్పటికే మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మృతదేహాలను గుర్తించి అధికారులు బంధువులకు అప్పగించనున్నారు.
ఇది కూడా చదవండి: Manchu Vishnu: జనరేటర్లో అందుకే షుగర్ వేశా.. మంచు విష్ణు హాట్ కామెంట్స్
మరోవైపు ప్రమాద స్థలం వరకు లోకో ట్రాక్‌ను జైపీ కంపెనీ సిద్ధం చేస్తోంది. ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు ఉన్నాయి. ఇక్కడే టీబీఎం సగ భాగం కూరుకుపోయింది. మట్టిని బయటకు తరలించేందుకు మ్యానువల్‌గా సాధ్యం కాకపోవడంతో లోకోను అక్కడి వరకు తెచ్చే ప్రయత్నం చేస్తు్న్నారు. కన్వేయర్ బెల్టు కూడా అందుబాటులోకి వచ్చింది. 12వ కిలోమీటర్ నుంచి 13.5 కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన మీటరున్నర మట్టిని రెస్క్యూ టీమ్స్ ఎత్తి పోస్తున్నాయి. లోకోను 13.5 కిలోమీటరు వరకు తీసుకొచ్చి మట్టిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Sumanth Reddy: భార్య దాష్టికానికి డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి
కొన్నిరోజుల క్రితం ఈ టన్నెల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. 8 మంది లోపల చిక్కుకుపోయారు. ఈ సంఘటన ఎనిమిదో రోజుకు చేరుకుంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తవ్వలేదు. పనులు పూర్తి చేసేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం మట్టి తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది.
ఇది కూడా చదవండి: Donald Trump: ఇంగ్లీష్‌ని అమెరికాలో అధికార భాష చేయనున్న ట్రంప్..