దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై సొంత పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. రాజీవ్ గాంధీ రెండు సార్లు చదువులో ఫెయిల్యూర్ అయ్యారని.. అయినా కూడా ఆయన ప్రధానమంత్రి కావడం ఆశ్చర్యం కలిగించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలు రాజకీయకంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ అస్త్రంగా మార్చుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థుల మల్క కొమరయ్య, అంజిరెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పని చేస్తున్న తమ కార్యకర్తలను చూసి గర్విస్తున్నట్లు తెలిపారు.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉగ్రవాది లాజర్ మాసిహ్‌ను యూపీ, పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మన్‌కు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ మాడ్యూల్ అధిపతి స్వర్ణ్ సింగ్ అలియాస్ జీవన్ ఫౌజీ కోసం ఈ ఉగ్రవాది పని చేస్తున్నట్లుగా గుర్తించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు మరోసారి తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. బందీలను వెంటనే విడుదల చేయాలని.. లేదంటే అంతు చూస్తానంటూ చివరి హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఉగ్ర కలకలం చోటుచేసుకుంది. ఖలీస్తానీ ఉగ్రవాదులు.. జైశంకర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. భారతీయ జెండాను చించేసి నానా హంగామా సృష్టించారు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు.. ఖలీస్తానీ ఉగ్రవాదితో పాటు ఆందోళనకారులను చెదరగొట్టారు.
గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న అమెరికా పౌరుల కోసం వైట్‌హౌస్ రహస్యంగా చర్యలు జరిపినట్లు తెలుస్తోంది. అమెరికన్ బందీలను విడుదల చేయాలని హమాస్‌ను అమెరికా అధికారులు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు సమాచారం ఇవ్వకుండానే.. ఈ చర్చలు జరిపినట్లుగా సమాచారం.
తమిళనాడులో దారుణం జరిగింది. అన్లైన్ రమ్మీ ఆటకు ఓ కుటుంబం బలి అయింది. భార్య మోహన ప్రియా, ఇద్దరు చిన్నారులు ప్రణీత, రాజీ ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా.. కరూర్ సమీపంలోని పశుపతిపాళయం దగ్గర రైలు కిందపడి ప్రేమ్‌రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
దేశీయ స్టాక్ మార్కెట్లో బుధవారం సరికొత్త జోష్ కనిపించింది. 10 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా భారీ ర్యాలీగా సూచీలు దూసుకెళ్లాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
కేంద్రంపై నటుడు కమల్‌హాసన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలను హిందీ రాష్ట్రాలుగా మార్చి.. బీజేపీ గెలవాలనుకుంటోందని కమల్ హాసన్ ఆరోపించారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలను బలవంతంగా హిందీ భాషగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ప్రశంసించినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఓ వైపు ఔరంగజేబును ప్రశంసిస్తూ.. ఇంకోవైపు శంభాజీ మహారాజ్‌ను విమర్శిస్తూ అజ్మీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ సభ్యుడి హోదాకు ఈ వ్యాఖ్యలు తగినవి కావని.. ప్రజాస్వామ్య సంస్థను అవమానించడమేనని రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ అన్నారు.