పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా ఉన్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ రక్షించింది. పది మంది భారతీయ నిర్మాణ కార్మికుల పాస్‌పోర్ట్‌లు లాక్ చేయబడ్డాయి. దీంతో వారంతా పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా ఉన్నారు. మొత్తానికి నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వారిని రక్షించింది.
అంతరిక్ష ప్రయోగంలో ఎలోన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టార్‌షిప్ కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ప్రయోగించిన కొన్ని నిమిషాలకే స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. దక్షిణ ఫ్లోరిడా-బహామాస్ సమీపంలో రాకెట్ పేలిపోయి శిథిలాలు చెల్లాచెదురుగా కింద పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి తహవూర్ రాణాకు అమెరికా న్యాయస్థానం షాకిచ్చింది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఇటీవల యూఎస్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
కర్ణాటకలోని హోసూర్‌లో దారుణం జరిగింది. ఓ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బంజరు పొలాల్లో బాలిక ఏడుస్తూ, కేకలు వేస్తూ కనిపించింది. ఒక స్త్రీ, పురుషుడు ఉన్న కూడా ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో వీడియో తెగవైరల్ కావడంతో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం గుజరాత్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అహ్మదాబాద్‌లోని రాజీవ్ గాంధీ భవన్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరగనుంది. మాజీ పీసీసీ అధ్యక్షులు, గుజరాత్ పీసీసీ సీనియర్ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఖలీస్తానీ ఉగ్రవాది దాడికి యత్నించాడు. అంతేకాకుండా భారత జాతీయ జెండాను చించేసి పడేశాడు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఖలీస్తానీ ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిచింది.
తమిళనాడులో త్రిభాషా ఉద్యమం ఉధృతం అవుతోంది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ మహిళా నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ కోయంబేడులో ఆందోళన చేపట్టారు. సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు. ఇక తమిళిసై చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమాన్ని తమిళనాడు పోలీసులు అడ్డుకున్నారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం పాకిస్థాన్‌లోని తన సొంత గడ్డపై అడుగుపెట్టింది. 13 ఏళ్ల తర్వాత ఆమె తన స్వస్థలానికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రి, భర్త, సోదరుడు హై సెక్యూరిటీ మధ్య పాక్‌కు చేరుకుంది. 15 ఏళ్ల వయసులో ఆమెపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. స్వాత్ లోయలో ఉగ్రవాదులు బస్సు ఎక్కి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలయ్యాయి.
సుప్రీంకోర్టులో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట లభించింది. సనాతన ధర్మం వ్యాఖ్యలపై కొత్త కేసులను నమోదు చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉదయనిధికి ఉపశమనం లభించింది. తదుపరి చర్యలకు కోర్టు అనుమతి అవసరం అని సుప్రీం ధర్మాసనం గురువారం పేర్కొంది.