కర్ణాటకలో గురువారం రాత్రి తుంగభద్ర కాలువ దగ్గర ఐదుగురు టూరిస్టులపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులను కాలువలో తోసేయగా.. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె డీఆర్ఐ కస్టడీలో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఆమె దగ్గర నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కర్ణాటకలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు, హోమ్ స్టే యజమానిపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే... కేంద్రంపై పోరాటానికి రెడీ అవుతోంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, త్రిభాషా విధానంపై పోరాటం చేసేందుకు డీఎంకే స్పీడ్ పెంచింది. మార్చి 12న తమిళనాడు వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టినట్లు డీఎంకే ప్రకటించింది.
ప్రధాని మోడీ శుక్రవారం గుజరాత్లో పర్యటించారు. అయితే ముందుగా సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్ చేసింది. ఆ సమయంలో హఠాత్తుగా ఓ బాలుడు(17) సైకిల్ తొక్కుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. దీన్ని గమనించిన పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ వెంటనే సైక్లింగ్ చేస్తున్న బాలుడిని అడ్డుకుని చితకబాదాడు. తల మీద, ముఖంపై పిడుగుద్దుల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా తప్పు సరిదిద్దుకున్నాడు. మహిళల దినోత్సవం ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ ద్వారా క్షమాపణ చెప్పాడు. ఇకపై మహిళలను గౌరవిస్తానని.. జరిగిపోయిన దాన్ని మార్చలేమని.. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని తెలిపారు. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ వేదికగా రణవీర్ అల్హాబాదియా కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
విమాన ప్రయాణమంటే ఎంతో ఖరీదు పెట్టి టికెట్ కొని ప్రయాణం చేస్తుంటారు. ఎవరైనా త్వరగా గమ్యం చేరుకోవాలని తాపత్రయం పడుతుంటారు. ఇంకా ఆహ్లాదకరంగా ప్రయాణం సాగిపోవాలని కోరుకుంటారు. అలాంటిది ఈ మధ్య విమానాల్లో వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
రన్యా రావు కన్నడ నటి. పైగా ఐపీఎస్ ఆఫీసర్ కుమార్తె. ఇప్పుడు ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఏదో గొప్ప పని చేసిందనో.. ఘనకార్యం చేసిందనో కాదు. కుటుంబ గౌరవానికి తగ్గట్టుగా ఉండాల్సిన ఆమె.. నీచానికి ఒడిగట్టింది. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే.. ఈమె ఎంత పెద్ద కిలాడీనో అర్థం చేసుకోవచ్చు.
హిందీపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడుపై కేంద్రం బలవంతంగా హిందీ రుద్దుతోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్దీ.. బీజేపీ గెలవాలని చూస్తోందని ఇటీవల డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేతలు పేర్కొన్నారు.
పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.330, 22 క్యారెట్లపై రూ.300 తగ్గింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,160గా నమోదైంది.