బీహార్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా నడిచాయి. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్-ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన తేజస్వీ యాదవ్.. రాష్ట్రంలో ఆదాయం లేనప్పటికీ బడ్జెట్ పెరిగిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీ గుజరాత్ పర్యటనలో భాగంగా జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ నిర్మించిన వంటారా జంతు రక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం వివిధ జంతువులతో మోడీ సరదాగా గడిపారు.
ఓ బైకర్ నిర్లక్ష్యం కారణంగా బస్సులోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. హైవేపై బస్సు వేగంగా దూసుకొస్తోంది. ముందున్న బైక్.. సడన్‌గా యూటర్న్ తీసుకున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక బస్సు డ్రైవర్.. బైకిస్టుల ప్రాణాలు కాపాడేందుకు వేరే రూట్లోకి పోనిచ్చాడు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. రాయ్‌బరేలిలోని లక్నో-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై ఉంచహార్ మార్కెట్ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ పెళ్లి కారు బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వ్యక్తులు.. ఎగిరి ఆటోపై పడ్డారు. కారు మాత్రం ఆపకుండా వెళ్లిపోయాడు.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా 10వ రోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధంతో ఇన్లెస్టర్లలో గబులు మొదలైంది. దీంతో గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాలను ఎదుర్కొంటోంది.
పెళ్లి అంగరంగా వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఇక నూతన దంపతులు రెండు రోజులు ఆనందంగా గడిపారు. వధువు.. అత్తింటిలో అడుగుపెట్టిన దగ్గర అందరినీ మర్యాదగా చూసుకుంటోంది. రెండోరోజు సాయంత్రం అందరికీ టీ అందించింది. కోడలు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎంతో సంబరపడ్డారు.
కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (23) హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మార్చి 1న రోహ్తక్-ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో నర్వాల్ మృతదేహం లభ్యమైంది. అయితే ఈ ఘటనపై హర్యానా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇక రంగంలోకి దిగిన సిట్ బృందం.. సోమవారం ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఝజ్జర్‌కు చెందిన సచిన్‌గా గుర్తించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఇక మావోల శిబిరాన్ని డీఆర్జీ సైనికులు ధ్వంసం చేశారు.
అయోధ్య రామమందిరంపై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన రెహ్మాన్(17)ను హర్యానా-గుజరాత్ పోలీసుల బృందం అరెస్ట్ చేశారు. రెండు హ్యాండ్ గ్రెనేడ్లతో రామమందిరాన్ని పేల్చాలని ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
మహారాష్ట్రలో ఓ సర్పంచ్ హత్య కేసు కూటమి ప్రభుత్వంలో రాజకీయ దుమారం రేపింది. బీడ్ జిల్లాలో డిసెంబర్ 9న సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్(45) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఫిబ్రవరి 27న పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ఇందులో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడి పేరు ఉంది.