Punjab: ఐఎస్ఐతో లింకు ఉన్న ఉగ్రవాది లాజర్ మాసిహ్ అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
- ఐఎస్ఐతో లింకు ఉన్న ఉగ్రవాది లాజర్ మాసిహ్ అరెస్ట్
- లాజర్ మాసిహ్‌ను అరెస్ట్ చేసిన పంజాబ్, యూపీ పోలీసులు
- భారీగా ఆయుధాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉగ్రవాది లాజర్ మాసిహ్‌ను యూపీ, పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మన్‌కు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ మాడ్యూల్ అధిపతి స్వర్ణ్ సింగ్ అలియాస్ జీవన్ ఫౌజీ కోసం ఈ ఉగ్రవాది పని చేస్తున్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ కార్యకర్తలతో కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లుగా యూపీ ఎస్‌టీఎఫ్ పోలీసులు కనుగొన్నారు. ఈ తెల్లవారుజామున అమృతసర్‌లో అదుపులోకి తీసుకోగా.. అతడి దగ్గర నుంచి మూడు హ్యాండ్ గ్రెనేడ్‌లు, రెండు యాక్టివ్ డిటోనేటర్లు, 13 కార్ట్రిడ్జ్‌లు, ఒక రష్యన్ తుపాకీ, అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తెల్లటి రంగు పేలుడు పొడి, ఘజియాబాద్ చిరునామాతో కూడిన ఆధార్ కార్డు, సిమ్ కార్డ్ లేని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Janhvi Kapoor : జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్ ఫొటోస్..
Also Read
లాజర్ మాసిహ్… ప్రస్తుతం పాకిస్థాన్ ఐఎస్‌ఐతో కలిసి ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. లాజర్ మాసిహ్ పంజాబ్‌లోని అమృత్‌సర్ నివాసం ఉంటున్నాడు. స్వర్ణ్ సింగ్ అలియాస్ జీవన్ ఫౌజీతో లాజర్ మాసిహ్‌కు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 24న పంజాబ్ జైలు నుంచి లాజర్ మాసిహ్ తప్పించుకుని పారిపోయాడు. పంజాబ్ పోలీసులు, యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో గురువారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో అతన్ని పట్టుకున్నట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమితాబ్ యష్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Ananya : ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆమెను చూసి నేర్చుకున్నా
తాజావార్తలు
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!