ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బఘేల్ నివాసంపై సోమవారం ఈడీ దాడులు చేస్తోంది. భిలాయ్‌లోని భూపేశ్ బఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంపై అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ కేసును కోర్టు కొట్టేసిందని భూపేశ్ బఘేల్ పేర్కొన్నారు. కేవలంలో కుట్రలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.
ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి వనాటు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. లలిత్ మోడీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోతం నపట్.. పౌరసత్వ కమిషన్‌కు ఆదేశించారు. ఇటీవలే దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దేశమైన వనాటు పౌరసత్వానికి చెందిన గోల్డెన్ పాస్‌పోర్టును లలిత్ మోడీకి తీసుకున్నారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరోసారి తీవ్రమవుతున్నాయి. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో సర్వనాశనం అయింది. ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల ద్వారా పరిస్థితులు సద్దుమణిగాయి. అంతా బాగున్నాయి అనుకుంటున్న సమయంలో మరోసారి పరిణామాలు తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 13న ముగిశాయి. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక సోమవారం నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.
కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో మార్క్ కార్నీని అధికార లిబరల్ పార్టీ ఎన్నుకుంది. మార్క్ కార్నీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేకాకుండా మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం కూడా లేదు. అనూహ్యంగా కెనడా 24వ ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక కావడం విశేషం. ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించారు. దీంతో లిబరల్ పార్టీలో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఇది కూడా చదవండి: […]
భారత సంతతికి చెందిన విద్యార్థిని సుదీక్ష(20) డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్ట్ బీచ్‌లో హఠాత్తుగా అదృశ్యమైంది. బికినీ ధరించి బీచ్‌లో నడుస్తుండగా కనిపించకుండా పోయింది. మార్చి 6న స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. సుదీక్ష తప్పిపోయిన విషయాన్ని స్నేహితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె కోసం అధికారులు గాలిస్తు్న్నారు.
భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్-చైనా కుట్రలు ఉన్నతంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్విదేది కీలక వ్యా్ఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆ రెండు దేశాల మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలను అంగీకరించాలన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎలోన్ మస్క్-విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియా మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు తొలగింపుపై ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఎలోన్ మస్క్.. వ్యంగ్యంగా మాట్లాడడంతో ఘర్ఫణ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గుజరాత్ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోలో ఆమెపై గాయాలు ఉన్నట్లుగా కనిపించాయి. దీంతో ఆమెపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారంటూ మహిళా సంఘాలు ఆరోపించాయి. ఇక ఆమెను జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు భోరున విలపించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆమెపై గాయాలు కావడంపై తీవ్ర దుమారం రేపుతోంది.