US Flight: విమానంలో మహిళ వికృత చర్యలు.. బట్టలు విప్పి పరుగులు
- విమానంలో మహిళ వికృత చర్యలు
- బట్టలు విప్పి పరుగులు.. కేకలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ప్రయాణమంటే ఎంతో ఖరీదు పెట్టి టికెట్ కొని ప్రయాణం చేస్తుంటారు. ఎవరైనా త్వరగా గమ్యం చేరుకోవాలని తాపత్రయం పడుతుంటారు. ఇంకా ఆహ్లాదకరంగా ప్రయాణం సాగిపోవాలని కోరుకుంటారు. అలాంటిది ఈ మధ్య విమానాల్లో వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆ మధ్య విమానంలోనే ఓ జంట శృంగారంలో పాల్గొన్న సంఘటనలు చూశాం. అలాగే ఓ వ్యక్తి ఏకంగా మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన సంఘటనలు చూశాం. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలైతే.. ఏకంగా బట్టలు విప్పేసి నానా హంగామా సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Telangana Heatwave Alert: వామ్మో ఇవేం ఎండలు రా బాబోయ్.. తెలంగాణలో భానుడి ప్రతాపం
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
సోమవారం టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని విలియం పి. హాబీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఫీనిక్స్, అరిజోనాకు వెళుతోంది. విమానం టేకాప్ అయి నింగిలోకి వెళ్లింది. అంతే ఓ మహిళా ప్రయాణికురాలు ఉన్నట్టుండి.. మొత్తం బట్టలు విప్పేసి.. పెద్ద పెద్దగా అరుస్తూ.. కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించింది. దీంతో సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులంతా హడలెత్తిపోయారు. కాక్‌పిట్‌లోకి వెళ్లి సిబ్బందిని దుర్భాషలాడింది. గుండెలపై బాదుకుంటూ కేకలు వేసింది. దాదాపు 25 నిమిషాల పాటు బట్టలు లేకుండానే కలియతిరిగింది. ఈ పరిణామంతో షాకైన సిబ్బంది.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ల్యాండింగ్ చేశాడు. ఇంతలో ఒకరు ఆమె దేహంపై దుప్పటి కప్పాడు. ఇక ఆమె విమానం దిగగానే పరుగెత్తుకుని వెళ్లిపోతుండగా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఆమె మానసిక క్షోభతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేనట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Heatwave Alert: వామ్మో ఇవేం ఎండలు రా బాబోయ్.. తెలంగాణలో భానుడి ప్రతాపం
NEW: Woman takes off all her clothes on a Southwest plane in Houston, demands to be let off.
The woman reportedly ran around the plane for 25 minutes "before action was taken" according to ABC 7.
After nearly half an hour, the plane finally made it back to the gate before the… pic.twitter.com/U0F0l4HEJJ
— Collin Rugg (@CollinRugg) March 7, 2025
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!