కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా తప్పు సరిదిద్దుకున్నాడు. మహిళల దినోత్సవం ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ ద్వారా క్షమాపణ చెప్పాడు. ఇకపై మహిళలను గౌరవిస్తానని.. జరిగిపోయిన దాన్ని మార్చలేమని.. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని తెలిపారు. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ వేదికగా రణవీర్ అల్హాబాదియా కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
ఇది కూడా చదవండి: Cricket Stars : స్టార్ క్రికెటర్లు.. క్రికెట్ కు గుడ్ బై.. సినిమాలకు సై..సై
దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ వ్యాఖ్యలను తప్పుపట్టింది. పాపులారిటీ ఉంటే ఏది పడితే అది మాట్లాడటానికి సమాజం అనుమతించదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు యూట్యూబర్‌కు చీవాట్లు పెట్టింది. అతని మనసులో ఏదో మురికి ఉందని.. దాన్ని యూట్యూబ్ షోలో కక్కేశాడని న్యాయస్థానం పేర్కొంది. సమాజంలో విలువలు అంటే ఏమిటి? దాని పారామితులు ఏమిటి, మీకు తెలుసా? అని ప్రశ్నించింది. సమాజంలో కొన్ని పరిమితులు, విలువలు ఉంటాయని… వాటిని గౌరవించాలని తెలిపింది. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా? అని ఏది పడితే అది మాట్లాడడానికి సమాజ నిబంధనలు ఒప్పుకోవని చెప్పింది. షోలో అతడు ఉపయోగించిన మాటలు.. మహిళా సమాజాన్ని సిగ్గుపడేలా చేసిందని అభిప్రాయపడింది. అతడు ఉపయోగించిన మాటలు అశ్లీలత కాకపోతే.. ఇంకేంటి?, అతడిపై ఎందుకు ఎఫ్ఐఆర్‌లు బుక్ చేయకూడదు.. ఎందుకు అరెస్ట్ చేయకూడదని రణవీర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: US Flight: విమానంలో మహిళ వికృత చర్యలు.. బట్టలు విప్పి పరుగులు
మొత్తానికి మహిళా దినోత్సవానికి ముందు రోజు మహిళా సమాజానికి యూట్యూబర్ క్షమాపణలు చెప్పాడు. ఇకపై తాను జాగ్రత్తగా ఉంటానని సమాధానం ఇచ్చాడు. మహిళలను గౌరవిస్తానని తెలిపాడు.