Ranya Rao: రన్యారావు శరీరంపై గాయాలు.. థర్డ్‌డిగ్రీ ప్రయోగించారా? అసలేమైంది?
- రన్యారావు శరీరంపై గాయాలు
- థర్డ్‌డిగ్రీ ప్రయోగించారా? అసలేమైంది?
- సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న మహిళా కమిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె డీఆర్‌ఐ కస్టడీలో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఆమె దగ్గర నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమెపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? లేదంటే ఇంకేమైనా చేశారా? తెలియదు గానీ.. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. రన్యారావు కంటి కింద గాయాలైనట్లు ఒక ఫొటో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆమెను అధికారులు ఏం చేశారంటూ నిలదీస్తున్నారు. ఆమెకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కర్ణాటక మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: IND vs NZ Final: రేపే భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు.. జోరుగా ఇరుజట్లు ప్రాక్టీస్!
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా.. రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దుబాయ్ నుంచి ఇలా పలుమార్లు బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆమె ఇంటిని సోదా చేయగా.. అక్కడ కూడా కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించినట్లుగా సమాచారం. జనవరి నుంచి మార్చి 3 వరకు దాదాపు 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని.. ఒక కానిస్టేబుల్ సాయంతో ఎలాంటి తనిఖీలు లేకుండా ఎయిర్‌పోర్టులో ఆమె కథ నడిపించినట్లుగా తెలుస్తోంది. బంగారం బిస్కెట్లు.. తొడలకు స్టిక్కర్లతో అంటించుకుని బయటకు వచ్చేసేదని సమాచారం. అయితే ఆమె వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: లక్ష మంది మహిళలతో భారీ సభ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
ఆమె దుబాయ్‌కు మాత్రమే కాకుండా యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాల నుంచి కూడా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ విషయాలు ఆమెనే చెప్పినట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలని ఆమె అధికారులను కోరినట్లు తెలుస్తోంది. తనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని.. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పినట్లుగా సమాచారం.
అయితే ఆమె ఒంటిపై గాయాలు కావడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఏం జరిగి ఉంటుందనేది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమెపై ఎవరైనా భౌతికదాడి చేశారా?, లేదంటే అధికారులే నిజం కక్కించేందుకు కొట్టారా? అనేది తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Falcon Scam: ఫాల్కన్ స్కామ్ కేసు.. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ సీజ్
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!