Ranya Rao: నటి కాదు.. పెద్ద కిలాడీ.. వెలుగులోకి రన్యా రావు బాగోతాలు
- వెలుగులోకి నటి రన్యా రావు స్టేట్‌మెంట్
- నేరాన్ని అంగీకరించిన రన్యా రావు
- రహస్యంగా ఉంచాలని అధికారులకు విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రన్యా రావు కన్నడ నటి. పైగా ఐపీఎస్ ఆఫీసర్ కుమార్తె. ఇప్పుడు ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఏదో గొప్ప పని చేసిందనో.. ఘనకార్యం చేసిందనో కాదు. కుటుంబ గౌరవానికి తగ్గట్టుగా ఉండాల్సిన ఆమె.. నీచానికి ఒడిగట్టింది. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే.. ఈమె ఎంత పెద్ద కిలాడీనో అర్థం చేసుకోవచ్చు.
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దుబాయ్ నుంచి ఇలా పలుమార్లు బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆమె ఇంటిని సోదా చేయగా.. అక్కడ కూడా కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించినట్లుగా సమాచారం. జనవరి నుంచి మార్చి 3 వరకు దాదాపు 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని.. ఒక కానిస్టేబుల్ సాయంతో ఎలాంటి తనిఖీలు లేకుండా ఎయిర్‌పోర్టులో ఆమె కథ నడిపించినట్లుగా తెలుస్తోంది. బంగారం బిస్కెట్లు.. తొడలకు స్టిక్కర్లతో అంటించుకుని బయటకు వచ్చేసేదని సమాచారం అయితే ఆమె వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తు్న్నారు.
Also Read
తాజాగా ఆమె బోగాతానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూఏఈ నుంచి ఇటీవల రన్యారావు 17 బంగారు బిస్కెట్లను తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. దుబాయ్‌కు మాత్రమే కాకుండా యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాల నుంచి కూడా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ విషయాలు ఆమెనే చెప్పినట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలని ఆమె అధికారులను కోరినట్లు తెలుస్తోంది. తనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని.. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Child Trafficking Case: చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
గతేడాది ఆమె 30 సార్లు దుబాయ్‌కు వెళ్లారని.. ఈ మధ్య కాలంలో కేవలం 15 రోజుల్లో నాలుగుసార్లు విదేశాలకు వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రతి ట్రిప్‌లో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లుగా దర్యాప్తులో తేలిందని అధికారులు పేర్కొన్నారు. స్మగ్లింగ్ చేసినందుకు ప్రతి ట్రిప్‌కు ఆమెకు రూ.12 లక్షల వరకు ముట్టినట్లు అధికారులు వెల్లడించారు.
రన్యారావు తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్నారు. కుమార్తె స్మగ్లింగ్ వార్త తెలిసి.. గుండె పగిలిపోయిందని ఆయన అన్నారు. స్మగ్లింగ్ గురించి తనకు తెలియదన్నారు. 2024లో జతిన్ హుక్కేరితో రన్యారావు వివాహం జరిగినట్లుగా చెప్పారు. అయితే వారిద్దరూ కలిసి ఉండడం లేదని.. విడిగా ఉండడం వల్ల ఆమె ఇలాంటి పనులు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఆమె చర్యలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే రామచంద్రరావు కూడా ఒక వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 2014 హవాలా కేసులో పెద్ద మొత్తంలో డబ్బు మాయం చేసినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే నకిలీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మరణాలపై 2016 నుంచి సీఐడీ దర్యాప్తు కేసు కూడా ఉంది. ప్రస్తుతం ఈ కేసులు దర్యాప్తులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
తాజావార్తలు
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!