ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ చేరుకున్నారు. మంగళవారం పోర్ట్ లూయిస్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఆత్మీయ స్వాగతం లభించింది. సోమవారం అర్ధరాత్రి మోడీ ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. ఇరు దేశాల సంబంధాలతో కొత్త అధ్యాయనం ప్రారంభించబోతున్నట్లు మోడీ పేర్కొన్నారు. బుధవరం మారిషస్ 57వ జాతీయ దినోత్సవం జరగనుంది. గౌరవ అతిథిగా మోడీ పాల్గొననున్నారు.
ఇంటర్ పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ప్రశ్నలు అడగడంపై పంజాబ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. మార్చి 4 నుంచి పంజాబ్‌లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. అయితే ఈ ప్రశ్నాపత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి పలు ప్రశ్నలు వచ్చాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. రెండేళ్లకు పైగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది.
ప్రధాని మోడీ మంగళ, బుధవారాల్లో మారిషస్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. స్నేహితుడు, ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గులంను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
నీటిలో ఉన్నప్పుడు మొసలికి ఎంత బలం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎంత బలమైన జంతువైన.. మొసలి ముందు బలాదూరే. నీటిలోకి వస్తే.. అమాంతంగా పట్టేస్తోంది. ఇప్పుడెందుకు మొసలి గురించి అంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ఎవరైనా పెంపుడు జంతువులకు ఆహారం పెడతారు.
పార్లమెంట్లో లోక్‌సభ స్పీకర్‌తో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ సమావేశం అయ్యారు. ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్‌తో ఏం చర్చించారన్నది ఇంకా తెలియలేదు. అయితే త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.
త్వరలో ఐపీఎల్ సందడి ప్రారంభం కాబోతుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ పీవర్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం.. బీసీసీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ వేదికల్లో పొగాకు, మద్యం ప్రకటనలు, అమ్మకాలకు సంబంధించిన ప్రకటనలు నిషేధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది.
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సోమవారం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సమస్యను సభలో లేవనెత్తారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్లో జరిగిన అర్ధనగ్న ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపుతోంది. పురుషులు, మహిళలు చిన్న చిన్న దుస్తులతో ర్యాంప్‌పై నడిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి షోలకు ఎలా అనుమతి ఇస్తారని విపక్షాల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యక్తమవుతోంది.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ నటి రన్యారావు కేసు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. రన్యా రావు సంస్థకు భూమి కేటాయింపుపై అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.