Lalit Modi: లలిత్ మోడీకి షాక్.. పౌరసత్వం రద్దు చేసిన వనాటు ప్రభుత్వం
- లలిత్ మోడీకి వనాటు ప్రభుత్వం షాక్
- పౌరసత్వం రద్దు చేయాలని వనాటు ప్రధాని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి వనాటు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. లలిత్ మోడీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోతం నపట్.. పౌరసత్వ కమిషన్‌కు ఆదేశించారు. ఇటీవలే దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దేశమైన వనాటు పౌరసత్వానికి చెందిన గోల్డెన్ పాస్‌పోర్టును లలిత్ మోడీ తీసుకున్నారు. ఇండియాలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు లలిత మోడీని స్వదేశానికి రప్పించేందుకు ఇప్పటికే భారత్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు లండన్‌ను భారత్ కోరింది. అయితే లలిత్ మోడీ.. అక్కడ నుంచి వనాటుకు మకాం మార్చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వనాటు ప్రభుత్వం కూడా పాస్‌పోర్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Virat Kohli: ఊరికే అయిపోరు గొప్పోళ్ళు.. మహమ్మద్ షమీ తల్లి పాదాలను తాకి.. ఆశీర్వాదం తీసుకున్న కోహ్లీ
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
లలిత్ మోడీపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాక వనాటు ప్రభుత్వం అప్రమత్తం అయింది. దీంతో లలిత్ మోడీకి జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ప్రధాన మంత్రి జోతం నపట్ ఆ దేశ పౌరసత్వ కమిషన్‌ను కోరినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
లలిత్ మోడీ 2010లో భారతదేశం విడిచి వెళ్లారు. ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనిపై వేటు పడింది. అనంతరం లండన్‌కు పారిపోయారు.

ఇటీవల ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున కొత్త గర్ల్ ఫ్రెండ్‌ను లలిత్ మోడీ పరిచయం చేశారు. ఆమెతో ఎప్పటి నుంచో స్నేహం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు.. అంతకముందు కూడా మాజీ మిస్ యూనివర్సిల్ సుస్మితా సేన్‌తో కూడా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమెతో ప్రయాణం సాగుతుందని పేర్కొ్న్నారు. మళ్లీ ఏమైందో తెలియదు గానీ.. ఇటీవల మరో కొత్త ప్రియురాలిని పరిచయం చేశారు.

తాజావార్తలు
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!