అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎలోన్ మస్క్-విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియా మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు తొలగింపుపై ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఎలోన్ మస్క్.. వ్యంగ్యంగా మాట్లాడడంతో ఘర్ఫణ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: MP Laxman: భారత్ ఎదుగుదలలో మహిళలే కీలకం కావాలి..
కేబినెట్ భేటీ అనంతరం ఓవల్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ స్పందించారు. కేబినెట్ భేటీలో ఘర్షణ లాంటిది ఏం జరగలేదన్నారు. తాను అక్కడే ఉన్నానని.. మస్క్-రూబియో.. ఇద్దరూ కలిసే ఉన్నారని పేర్కొన్నారు. వారిద్దరూ అద్భుతంగా పని చేస్తున్నారని ట్రంప్ కితాబు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: YV Subba Reddy: యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది..
ప్రభుత్వ వ్యయాలను కట్టడి చేయడం కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీని ట్రంప్ ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను మస్క్‌కు అప్పగించారు. ఇందులో భాగంగా వేల మంది ఫెడరల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేందుకు మస్క్ సిఫార్సు చేశారు. తాను సిబ్బందిని తగ్గించడంతో పాటు.. బాగా పని చేసేవారిని ఉన్నత స్థానాలకు తీసుకొస్తానని చెప్పారు. పలువురు నిపుణులు, డెమోక్రాట్లు మస్క్ చర్యలు సరైనవి కావని విమర్శలు గుప్పిస్తుండగా ట్రంప్ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. ఇదే అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. విలేకర్ల ప్రశ్నలను ట్రంప్ తోసిపుచ్చారు.
ఇది కూడా చదవండి: Praja Bhavan: ప్రజా భవన్‌లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం..