బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోలో ఆమెపై గాయాలు ఉన్నట్లుగా కనిపించాయి. దీంతో ఆమెపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారంటూ మహిళా సంఘాలు ఆరోపించాయి. ఇక ఆమెను జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు భోరున విలపించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆమెపై గాయాలు కావడంపై తీవ్ర దుమారం రేపుతోంది.
ఇది కూడా చదవండి: Ranya Rao: రన్యారావు శరీరంపై గాయాలు.. థర్డ్‌డిగ్రీ ప్రయోగించారా? అసలేమైంది?
ఈ వ్యవహారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. దుబాయ్ వెళ్లకముందు నుంచే ఆమెపై గాయాలు ఉన్నట్లుగా తెలిపారు. ఈ విషయం ఆమెనే వెల్లడించినట్లుగా పేర్కొన్నారు. అయితే గాయాలు ఎలా అయ్యాయన్నది మాత్రం వెల్లడించలేదు. ఇక ఆమెకు వైద్య సదుపాయం అందించాలని కోర్టు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: AVK GROUP : వెస్ట్ ఫీల్డ్స్ లో పెట్టుబడి మీ భవితకు భరోసా!
ఇదిలా ఉంటే రన్యారావు గాయాలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆమెను అధికారులు ఏం చేశారంటూ నిలదీస్తు్న్నారు. ఆమెకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కర్ణాటక మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి హామీ ఇచ్చారు.
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా.. రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దుబాయ్ నుంచి ఇలా పలుమార్లు బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆమె ఇంటిని సోదా చేయగా.. అక్కడ కూడా కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించినట్లుగా సమాచారం. జనవరి నుంచి మార్చి 3 వరకు దాదాపు 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని.. ఒక కానిస్టేబుల్ సాయంతో ఎలాంటి తనిఖీలు లేకుండా ఎయిర్‌పోర్టులో ఆమె కథ నడిపించినట్లుగా తెలుస్తోంది. బంగారం బిస్కెట్లు.. తొడలకు స్టిక్కర్లతో అంటించుకుని బయటకు వచ్చేసేదని సమాచారం. అయితే ఆమె వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Women’s Day : మహిళ త్యాగం, ప్రేమ ఎనలేనివి..!