లండన్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వందలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకున్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హీత్రో విమానాశ్రయాన్ని మూసివేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టు పని చేయదని అధికారులు తెలిపారు. ఈ విమానాశ్రయానికి కూడా ఈ సబ్‌స్టేషన్ నుంచే విద్యుత్ సరఫరా అవుతోంది. భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి: IPL 2025: 500 పరుగులు చేస్తే చాలు.. యువ క్రికెటర్లకు సురేశ్ రైనా కీలక సూచన!
ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు హీత్రో ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితులు అనుకూలించడం లేదని పేర్కొన్నారు. ప్రయాణికులెవరూ విమానాశ్రయానికి రావొద్దని అధికారులు కోరారు.
ఇదిలా ఉంటే సబ్‌స్టేషన్‌లో భారీగా అగ్నిప్రమాదం సంభవించగానే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సమీపంలో 150 ఇళ్లల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు 10 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Watermelon:కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఇన్ని రోజుల కంటే ఎక్కువ నిల్వ చేయొద్దు!