Photo Shoot: ఫొటోషూట్‌లో అపశృతి.. కలర్ బాంబ్ పేలి వధువు విలవిల
- ఫొటోషూట్‌లో అపశృతి
- కలర్ బాంబ్ పేలి వధువు విలవిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు పెళ్లంటే చాలా సింపుల్‌గా జరిగిపోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. డబ్బు పెరిగింది. ఆలోచన మారింది. ఒకరి కంటే గొప్పగా వేడుక చేసుకోవాలని తాపత్రయం పడుతున్నారు. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకునేది. దీన్ని గ్రాండ్‌గా చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దీని పేరుతో కొత్త కొత్త ట్రెండ్‌లు సృష్టిస్తున్నారు. పెళ్లికి ముందు ఫొటోషూట్‌లంటూ.. విహారయాత్రలంటూ లేనిపోని ఆచరాలు పుట్టుకొస్తున్నాయి. ఈ పేరు మీద కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ఆ మధ్య ఫొటోషూట్ పేరుతో నదిలోకి దిగి వీడియోలు తీస్తుండగా ప్రమాదవశాత్తు పుట్టి మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఫొటోషూట్ పేరుతో జరిగిన ఘటనలో తృటిలో వధువుకు ముప్పు తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Yellamma : చివరి నిమిషంలో సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా..!
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
భారత సంతతి చెందిన జంట కెనడాలో ఉంటున్నారు. అయితే వివాహ వేడుక కోసం భారత్‌కు వచ్చారు. అయితే పెళ్లి-రిసెప్షన్‌కు ముందు జంట ఫొటోషూట్ ఏర్పాటు చేశారు. నవ వధూవరులిద్దరూ ఆనందంగా.. సంతోషంగా ఫొటోలు.. వీడియోలు దిగుతున్నారు. ఉన్నట్టుండి ఏమి ఆలోచన వచ్చిందో.. ఏమో తెలియదు గానీ.. కొంచెం భిన్నంగా ఉండాలని అనుకున్నారేమో తెలియదు గానీ.. కలర్ బాంబులను ఏర్పాటు చేశారు. ఫొటోషూట్ కోసం వరుడు.. వధువును పైకి లేపాడు. ఆ సమయంలో ఒక్కసారిగా కలర్ బాంబ్ పేలి వధువును వేగంగా ఢీకొట్టింది. అంతే ఒక్కసారిగా ఆమె విలవిలలాడిపోయింది. ఆమె జుట్టు కాలిపోవడమే కాకుండా.. నడుం దగ్గర తీవ్రగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Mohammed Siraj: ఆర్సీబీ, కోహ్లీని వీడటంపై మహ్మద్ సిరాజ్ ఏమన్నాడంటే?
పెళ్లిళ్లలో బాణాసంచా పేల్చడం సహజమే. అయితే ఏది చేసినా శృతిమించకూడదు. లేదంటే లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. జంట వీడియో పోస్ట్ చేసి.. తమలా ఎవరూ చేయొద్దని.. ఒకవేళ ఫొటోషూట్‌లు చేసుకున్నా జాగ్రత్తలు తీసుకోవాలని జంట విక్కీ, ప్రియా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను 22 మిలియన్లు వీక్షించారు. ఆమె వెంటనే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని యథావిధిగా పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇక వీడియోను వీక్షించిన నెటిజన్లు.. వధువు పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని వివాహ బంధాన్ని ఆస్వాదించాలని కోరారు.
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!