వామ్మో.. ఆడోళ్లు ఎంతకు బరి తెగిస్తున్నారు. ప్రియుడితో సుఖానికి అడ్డొస్తున్నారని.. కట్టుకున్నవాళ్లనే కాటికి పంపించేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ హత్య మరువక ముందే జైపూర్‌లో మరో హత్య కలవరం పుట్టిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ధన్నాలాల్ సైని-గోపాలి దేవి భార్యాభర్తలు. అయితే గోపాలి దేవి గత ఐదేళ్లుగా కుష్వాహాతో వివాహేతర సంబంధం నడుపుతోంది. కుష్వాహా బట్టల షాపులో పని చేస్తున్నాడు. ధన్నాలాల్ సైని కూరగాయాల వ్యాపారం చేస్తుంటాడు. భార్య గోపాలి దేవి ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లుగా బయటకు వెళ్లిపోతుండేది. అయితే సైనికి అనుమానం వచ్చి.. ఆమెను వెంబడించగా బట్టల షాపులో కుష్వాహాతో గోపాలి దేవి కనిపించింది. ఇద్దరూ కలిసి ఉండడం చూసి సైని కోపంతో రగిలిపోయాడు. దీంతో అంతస్తులోని మరొక దుకాణానికి సైనిని తీసుకెళ్లి గోపాలి దేవి-కుష్వాహా ఇనుప పైపుతో దాడి చేశారు. అనంతరం తాడుతో గొంతు కోసి చంపేశారు. అనంతరం బట్టల సంచిలో మృతదేహాన్ని పెట్టి బైకులో తీసుకుని రింగ్ రోడ్డు దగ్గర పడేసి తగలబెట్టారు. అయితే రెండు రోజుల తర్వాత సగం కాలిన మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు.
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీని పరిశీలించగా బైకుపై మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. బైక్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా బండారం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తు్న్నాడని చంపేసినట్లుగా పోలీసులు తెలిపారు. బాధితుడు బట్టల షాపులోనే చనిపోయి ఉండొచ్చని జైపూర్ దక్షిణ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దిగంత్ ఆనంద్ అన్నారు.