పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో నడిపించాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లే క్రమశిక్షణ తప్పుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఘటనే ఇందుకు ఉదాహరణ.
ఉత్తరప్రదేశ్ మధురలోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అంగన్‌వాడీ కార్యకర్త.. అసిస్టెంట్ టీచర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌లో కొట్టుకున్నట్లుగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ గొడవలో చిన్నారులు కూడా పాలుపంచుకోవడం విశేషం. సమీపంలో ఉన్న కొంత మంది వచ్చి ఇద్దరినీ విడదీశారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చేనా..?
అసిస్టెంట్ టీచర్ ప్రీతి తివారీ ఇటీవల జౌన్‌పూర్ నుంచి మధుర పాఠశాలకు బదిలీ మీద వచ్చింది. మార్చి 26న అంగన్‌వాడీ కార్యకర్త చంద్రవతితో ఒక విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. అంతే ఒక్కసారిగా కొట్లాటకు దిగారు. ఇద్దరూ తన్నుకుంటూ.. ఒకరిపై ఒకరు పడి పిడుగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘటనలో టీచర్‌కు మద్దతుగా చిన్నారులు వచ్చారు. అంగన్‌వాడీ టీచర్‌పై దాడి చేశారు.
అయితే ఈ వీడియో విద్యాశాఖ అధికారులు దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు చేయాలని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కైలాష్ శుక్లాకు బాధ్యతలు అప్పగించారు.
ఈ ఘటనకు టీచర్ ప్రీతి తివారీనే కారణంగా అధికారులు గుర్తించారు. ఆమె ఎక్కడ పని చేసినా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నట్లుగా కనుగొన్నారు. గతంలో కూడా టీచర్‌పై అనేక ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్త చంద్రవతిపై టీచరే గొడవ పెట్టుకున్నట్లుగా తెలిపారు. ఇక ఈ ఘటనలో చంద్రవతి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Nirmal: ప్రేమ వివాహం.. ఒకే మండపంలో ఇద్దరి యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు..
*मथुरा*: 😎
आंगनवाड़ी सहायिका और शिक्षिका के बीच मारपीट, बच्चों के सामने हुआ हंगामा !
मथुरा के छाता क्षेत्र में एक आंगनवाड़ी केंद्र पर एक घटना सामने आई,, जिसकी वीडियो सोशल मीडिया पर वायरल हो रही है ।🧐 pic.twitter.com/u3zgJXLzB2
— जन स्वदेश पिटारा (@pradipy81315327) March 27, 2025