Gujarat: కన్నీళ్లు తెప్పిస్తున్న జెట్ పైలట్ మృతి.. వారం క్రితమే నిశ్చితార్థం.. ఇంతలో విషాదం
- కన్నీళ్లు తెప్పిస్తున్న జెట్ పైలట్ మృతి
- వారం క్రితమే నిశ్చితార్థం..
- ఇంతలో జెట్ ప్రమాదంలో సిద్ధార్ధ మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోగా.. మరొక పైలట్ గాయాలతో బయటపడ్డాడు.
అయితే ఈ దుర్ఘటనలో సిద్ధార్థ్ యాదవ్(28) అనే పైలట్ ప్రాణాలు వదిలాడు. 2016లో నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్ష (NDA)లో ఉత్తీర్ణత సాధించి భారత వైమానిక దళంలో చేరాడు. గత నెల మార్చి 23న నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఇందుకోసం సిద్ధార్థ యాదవ్ సిద్ధపడుతున్నాడు. కానీ ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
శిక్షణలో ఉండగా ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే జామ్‌నగర్ జిల్లాలోని సువార్ద గ్రామంలోకి వచ్చేటప్పటికీ ప్రమాదం పొంచి ఉందని గుర్తించాడు. ఇళ్ల మధ్య కూలిపోతే.. పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని భావించాడు. ప్రమాదం నుంచి ప్రజలను కాపాడాలని నిర్ణయం తీసుకున్నాడు.. తనతో పాటు ఉన్న కో-పైలట్‌ను కిందకు దించేసి.. జనసాంద్రత లేని ప్రాంతానికి జెట్‌ను నడిపించాడు. సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు.. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. దీంతో సిద్ధార్ధ యాదవ్ అమరడుయ్యాడు. కానీ గ్రామస్తుల ప్రాణాలను కాపాడి.. ఒక సాహస వీరుడయ్యాడు.
బుధవారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలోని వైమానిక దళం స్టేషన్ నుంచి జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. కొన్ని నిమిషాల్లోనే కూలిపోవడంతో రేవారీ నివాసి అయిన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ మరణించాడు. సిద్ధార్ధ ఇటీవలే సెలవుల తర్వాత విధులకు రావడం విశేషం.
సుశీల్-నీలం యాదవ్‌ల ఏకైక కుమారుడు సిద్ధార్థ్ యాదవ్. ఫైటర్ పైలట్‌గా శిక్షణ పూర్తి చేసి 2016లో NDA పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత భారత వైమానిక దళంలో చేరాడు. రెండేళ్ల క్రితమే ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి లభించింది. రేవారిలోని భల్కి-మజ్రా గ్రామానికి చెందిన సిద్ధార్ధ కుటుంబం నవంబర్ 2న జరగాల్సిన వివాహం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే సిద్ధార్థ తిరిగి విధుల్లో చేరాడు. కానీ ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. దీంతో బంధువులంతా కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక కుమారుడి యొక్క ధైర్య సాహసాలను తండ్రి సుశీల్ యాదవ్ ప్రశంసించారు. ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!