Wedding Anniversary: ఘోరం.. పెళ్లిరోజున భార్యతో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
- ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఘోరం
- పెళ్లిరోజున భార్యతో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో భర్త మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కళ్ల ముందు ఉన్నవారే కానరాకుండా పోతున్నారు. ఈ మధ్య చావులు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా హఠాత్తుగా ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.
వసీం సర్వత్ (50), ఫరా ఇద్దరూ భార్యాభర్తలు. వసీం సర్వత్ షూ వ్యాపారవేత్త. దంపతులిద్దరికీ వివాహమై 25 ఏళ్లైంది. ఇంకేముంది దీన్ని పురస్కరించుకుని గ్రాండ్‌గా వేడుక నిర్వహించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. దీని కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికను ముద్రించారు. స్వయంగా దంపతులిద్దరూ బంధువులను కలిసి ఆహ్వాన కార్డులను అందజేశారు. వేడుక కోసం పిలిభిత్ బైపాస్ రోడ్డుపై ఉన్న ఒక మండపాన్ని బుక్ చేశారు.
Also Read
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
గ్రాండ్‌గా వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. శ్రేయోభిలాషులు, బంధువులు, స్నేహితులంతా వేడుకకు హాజరయ్యారు. సందడి.. సందడిగా, ఉల్లాసంగా.. ఉత్సాహంగా కార్యక్రమం జరుగుతోంది. ఈ ఆనందంలో దంపతులిద్దరూ సాంప్రదాయ దుస్తులు ధరించి స్టేజ్‌పై చాలా జాలిగా డ్యాన్స్ చేస్తున్నారు. హాజరైనవారంతా చప్పట్లతో ఉత్తేజపరిచారు. అంతే.. అంతలోనే వాతావరణమంతా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఉన్నట్టుండి వసీం సర్వత్ స్టేజ్‌పై కుప్పకూలిపోయాడు. ఉన్న చోటునే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. భార్య, బంధువులంతా సపర్యలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అకస్మాత్తుగా ప్రాణాలు పోయాయి. అయినా కూడా కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఒకసారిగా వినోదం కాస్త.. విషాదంగా మారిపోయింది. చూసిన వారంతా అవాక్కైపోయారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. భార్యను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#Watch: यूपी के बरेली में शादी की 25वीं सालगिरह पर आयोजित पार्टी के दौरान डांस करते समय जूता कारोबारी अचानक स्टेज पर गिर गए। कारोबारी को अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने उन्हें मृत घोषित कर दिया। इस घटना का वीडियो सोशल मीडिया पर वायरल है।#UttarPradesh #Bareilly pic.twitter.com/qj6IOgTSFU
— Hindustan (@Live_Hindustan) April 3, 2025
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!