పశ్చిమ బెంగాల్‌లో ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ చట్టం అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ముర్షిదాబాద్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. నిరసనకారులు రాళ్లు రువ్వి.. పోలీస్ వాహనాలు తగలబెట్టారు. తాజాగా ఇదే అంశంపై జైన సమాజం నిర్వహించిన విశ్వ నవకార్ మహామంత్ర దివస్‌లో మమత పాల్గొని మాట్లాడారు.
ఇది కూడా చదవండి: Priyansh Arya: నమస్కారం సర్.. నా ఇన్నింగ్స్ ఎలా ఉంది!
మతం ప్రాతిపదికన బెంగాల్‌ను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని.. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించబోనని మమత తేల్చి చెప్పారు. తనను చంపినా పర్వాలేదు.. కానీ ఐక్యతను మాత్రం దెబ్బతియ్యనని చెప్పుకొచ్చారు. ముస్లింలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచాలన్నారు. వక్ఫ్ చట్టం అమలు కాకుండా.. ముస్లింలను రక్షించే బాధ్యత తనదేనన్నారు.
ఇది కూడా చదవండి: Summer Tips: వేసవిలో తాటి ముంజలుతో ఎన్ని లాభాలో..!
చాలా మంది తనను అన్ని మతాల ప్రదేశాలను ఎందుకు సందర్శిస్తారని అడుగుతారని.. అలాంటి వారికి ఏం చెబుతానంటే.. జీవితాంతం సందర్శిస్తూనే ఉంటానని చెబుతానన్నారు. తనను కాల్చి చెంపినా.. ఐక్యత నుంచి వేరు చేయలేరన్నారు. బెంగాల్‌లో విభజనకు తావుండదని మమత తేల్చి చెప్పారు.
వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏప్రిల్ 8 నుంచి అల్లర్లు జరుగుతున్నాయి. పోలీస్ వాహనాలు తగలబెట్టారు. రాళ్లు రువ్వారు. బెంగాల్ జనాభాలో ముస్లింలు దాదాపు 30 శాతం ఉన్నారు. వీళ్లంతా తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మైనార్టీలకు అండగా ఉంటానని మమత హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Jagadish Reddy: వాళ్లు తెలంగాణ నీళ్లను దొంగిలించుకుని పోతున్నారు..