ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో మరోసారి దుబాయ్ విమానాశ్రయం చోటు దక్కించుకుంది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల టాప్ 10 జాబితాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. టాప్ 10 జాబితాలో భారతీయ ఎయిర్‌పోర్టు కూడా చోటు దక్కించుకుంది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు 77.8 మిలియన్ల మంది ప్రయాణికులతో ప్రపంచంలోనే 8వ ర్యాంక్ సంపాదించింది.
ఇది కూడా చదవండి: Visakhapatnam: 24 గంటలలో డెలివరీ కావలసిన గర్భిణిని.. దారుణంగా చంపిన భర్త
ఇక రెండో ర్యాంకులో లండన్‌లోని హిత్రూ ఎయిర్‌పోర్టు, సియోల్ ఇంచియాన్, సింగపూర్, ఆమ్‌స్టర్‌డామ్ ఇలా మొదటి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు ప్రధాన వనరు గల్ఫ్ మెగా హబ్ అని తెలిపింది. గత ఏడాది 92.3 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణించారు. అంటే 2023 కంటే 6.1 శాతం ఎక్కువ మంది ప్రయాణించారు.
ఇక 2024లో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణం పెరిగింది. మొత్తం ప్రయాణీకుల సంఖ్య 9 శాతం పెరిగి దాదాపు 9.5 బిలియన్లకు చేరుకుంది. ఇది కోవిడ్-19కి ముందు ఉన్న దానికంటే దాదాపు 3.8 శాతం అధిగమించింది. మహమ్మారి నుంచి బలంగా పుంజుకుంటున్నాయని బ్లూమ్‌బెర్గ్ ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ACI) సోమవారం ఒక నివేదికలో తెలిపింది.
172 దేశాల్లో 2, 181 విమానాశ్రయాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో 9.9 బిలియన్ల మంది విమాన ప్రయాణాలు చేస్తారని ఏసీఐ అంచనా వేసింది. కానీ అనూహ్యంగా ప్రయాణికుల వృద్ధి రేటు మందగించింది. దీనికి కారణం ఆర్థిక అనిశ్చితి, భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తతలే కారణంగా పేర్కొంది.
ఇది కూడా చదవండి: UP: ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయిపై దాడి.. నిందితులకు ‘‘యోగి’’ మార్క్ ట్రీట్మెంట్.. వీడియో వైరల్..