రోజురోజుకు దేశంలో నేరాలు-ఘోరాలు పెరిగి పోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మాత్రం మార్పు రావడంతో లేదు. ఏదొక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది. కాబోయే భర్త ఎదుటే.. యువతిపై మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Jr NTR: ఎన్టీఆర్ బక్క చిక్కడానికి అనారోగ్యమే కారణమా?
కాబోయే భర్తతో కలిసి ఓ యువతి ఏప్రిల్ 10న విహారయాత్రకు ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలోని హజారా కెనాల్ దగ్గరకు వెళ్లి ఏకాంతంగా విహరిస్తున్నారు. అక్కడే కాపుకాచిన మృగాళ్లను జంట గమనించలేదు. అంతే అమాంతంగా జంటపై ఆరుగురు వ్యక్తుల బృందం దాడికి పాల్పడ్డారు. కాబోయే భర్తను దారుణంగా కొట్టి.. అనంతరం బంధించి.. యువతిని గదిలోపలికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Chittoor: ప్రేమ పెళ్లి.. తండ్రికి సీరియస్‌గా ఉందని పుట్టింటికి వెళ్లి అనంతలోకాలకు వివాహిత
అయితే ఇటీవల యువతి ఆరోగ్యం క్షీణించింది. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించడంతో విషయాన్ని బాధితురాలు హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో హుటాహుటినా పోలీసులు బాధితురాలి దగ్గరకు వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాబోయే భర్తతో కలిసి పిక్నిక్ స్పాట్‌లో విహరిస్తుండగా.. ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని.. మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: JR NTR : వార్-2లో ఎన్టీఆర్ షర్ట్ లెస్ యాక్షన్..?