ఢిల్లీ బాంబ్ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. తవ్వేకొద్దీ కుట్ర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. తాజాగా ఉగ్రవాదులకు సంబంధించిన మరో కారును అధికారులు గుర్తించారు. ఉగ్ర కుట్రలో భాగంగా 5వ వాహనం అద్దెకు తీసుకున్నట్లుగా కనిపెట్టారు. హ్యుందాయ్ i10 కారును అద్దెకు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Epstein: ఎప్‌స్టీన్ ఫైళ్ల విడుదల బిల్లుకు చట్టసభ ఆమోదం.. ట్రంప్ ఏం చేయబోతున్నారో..!
అక్టోబర్ 24-27 మధ్య ఈ కారును అద్దెకు తీసుకున్నట్లు కనిపెట్టారు. నవంబర్ 10న ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు కొన్ని రోజుల పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్ అంతటా రహస్యంగా పేలుడు పదార్థాలను తరలించినట్లుగా గుర్తించారు. ఈ కారు ఒక టాక్సీ యజమానిదిగా చెందినది.. మూడు రోజుల అద్దెకు రూ.4,000 చెల్లించారు. డ్రైవర్‌ను తీసుకెళ్లేందుకు నిరాకరించినట్లు యజమాని చెప్పాడు. డాక్టర్ ముజమ్మిల్ ఇంట్లో పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్, ఇతర రసాయనాలు నిల్వలు ఉన్నాయి. వీటిని రవాణా చేయడానికి అద్దె కారును ఉపయోగించినట్లు తెలుస్తోంది. డాక్టర్ ఉమర్ అద్దె కారును ఉపయోగించే పేలుడు పదార్థాలు రవాణా చేసినట్లుగా స్పెషల్ సెల్ అధికారులు కనిపెట్టారు.
ఇది కూడా చదవండి: SSRMB : రాజమౌళి ‘వారణాసి’ బడ్జెట్.. రెమ్యునరేషన్స్ తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే?
ప్రస్తుతం వాహనాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఇక టాక్సీ యజమాని, డ్రైవర్‌కు ఉమర్ ఫొటో చూపించగానే ఇతడే అద్దెకు తీసుకెళ్లినట్లుగా నిర్ధారించారు. అయితే కారుకు జీపీఎస్ లేకపోవడం వల్ల కచ్చితమైన మార్గాన్ని అన్వేషించలేకపోతున్నారు. ప్రస్తుతం ఎరువుల దుకాణాలు, రసాయన సరఫరాదారుల షాపుల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరిస్తున్నారు. డాక్టర్లు ఉమర్, ముజమ్మిల్ ఎక్కువగా అద్దె కార్లనే ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. అనుమానం రాకుండా ఉండేందుకు ఉమర్, ముజమ్మిల్ అద్దె కార్లనే ఉపయోగించినట్లుగా ఒక అధికారి పేర్కొన్నారు. ఇక మంగళవారం డాక్టర్లు షాహీద్, ముజమ్మిల్ మారుతి బ్రెజ్జా కారును కొనుగోలు చేసిన ఫొటో వైరల్ అయింది. సెప్టెంబర్ 25న షాహీద్ పేరున కారు కొనుగోలు చేశారు. అయితే ఈ ఫొటో నిజమైనదేనని అధికారులు నిర్ధారించారు.