Virginia Giuffre: ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గియుఫ్రే ఆత్మహత్య
- ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గియుఫ్రే ఆత్మహత్య
- అమెరికా మీడియాకు ఒక ప్రకటనలో తెలిపిన కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వర్జీనియా గియుఫ్రే(41) ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యలు తెలిపారు. అమెరికా మీడియాకు కుటుంబ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చాలా ఏళ్లుగా ఆమె ఆస్ట్రేలియాలోని నీర్గాబిలో నివాసం ఉంటోంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని తన పొలంలో మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గుండె బరువుతో ఈ వార్తను తెలియజేస్తున్నట్లు చెప్పారు.
అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ , పిన్స్ ఆండ్రూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గియుఫ్రే ఆరోపించారు. అమెరికా బిలియనీర్ జెఫ్రీ ఎప్స్టీన్ తనను లైంగిక బానిసగా ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించింది. అలాగే పిన్స్ ఆండ్రూ అలియాస్ డ్యూక్ ఆఫ్ యార్క్‌పై 2021, ఆగస్టులో గియుఫ్రే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆండ్రూ తనతో 17 ఏళ్ల వయసు నుంచి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఆండ్రూ పదే పదే ఖండిస్తూ వచ్చాడు. కానీ అతడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. ఇక 2022, మార్చిలో గియుఫ్రే-ఆండ్రూ కోర్టులో ఒక పరిష్కారానికి వచ్చినట్లు ప్రకటించారు.
Also Read
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ఇక 2025, మార్చి నెలలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను గియుఫ్రే సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇంకా నాలుగు రోజులు బతకాల్సి ఉందని పేర్కొంది. తనకు మూత్రపిండాల వైఫల్యం వచ్చిందని రాసుకొచ్చింది. 8 ఎనిమిది రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలేంటో తెలియజేయలేదు.
ఇక గియుఫ్రే ఫ్లోరిడాలో పెరిగింది. చిన్నతనంలోనే కుటుంబ స్నేహితుడి చేతిలో వేధింపులకు గురైనట్లు గతంలో చెప్పింది. దీని కారణంగా యుక్తవయసులో కొన్నిసార్లు వీధుల్లో ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని ఆమె చెప్పుకొచ్చింది. గియుఫ్రే మరణంపై ఆమె వ్యక్తిగత లాయర్, స్నేహితులు సంతాపం వ్యక్తం చేశారు.

తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్‌రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!