బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు.. సోమవారం కాస్త ఊరటనిచ్చింది. భారీగానే తగ్గింది. దీంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపించారు. కానీ ఒక్కరోజు గ్యాప్‌లోనే మళ్లీ షాకిచ్చింది. ఓ వైపు శుభకార్యాలు.. ఇంకోవైపు ధరల పెరుగుదలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Rohit : ఫ్యామిలీ మ్యాన్ 3 నటుడి అనుమానాస్పద మృతి
నేడు తులం బంగారంపై రూ.440 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరగడంతో రూ. 89,800 దగ్గర అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 పెరగడంతో రూ. 97,970 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: ఉగ్రవాది హషిమ్ మూసా అప్‌డేట్ ఇదే.. దర్యాప్తులో ఏం తేలిందంటే..!