భారత్‌లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేరళ, ముంబై, ఢిల్లీలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి.
కీలక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీని చావుదెబ్బ కొట్టింది. ఈ ఓటమితో క్వాలిఫయర్ వన్‌కి అర్హత సాధించాలని భావించిన ఆర్సీబీకి చుక్కెదురైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సందర్భంగా పూంఛ్ ప్రాంతంలో ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయి. కొద్ది సేపటి క్రితమే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ ఏడాది వేసవి కాలంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఈ ఏడాది భిన్నమైన వాతావరణం నెలకొంది. పెద్దగా ఎండల ప్రభావం కనిపించకుండానే వేసవి ముగుస్తోంది.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి భారీ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయన చిక్కుల్లో పడ్డారు. జార్ఖండ్‌లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్‌గాంధీకి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.
దేశంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్ర నేత బసవరాజు హతమయ్యాడు. ఇతడిపై రూ.కోటికి పైగా రివార్డు ఉంది.
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ తీరును భారత్ ఎండగట్టింది. ఉగ్రవాద దాడుల్లో 20,000 మంది భారతీయులు మరణించారని భారత్ తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు గుప్పించింది.
తన భార్య జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ప్రియుడితో హోటల్లో ఏకాంతంగా గడిపిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఇవ్వాలని భారత సైన్యంలో మేజర్‌గా పని చేస్తున్న ఒక అధికారి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు.
పెళ్లి సంబంధం చూసి.. ఓ ఇంటి వాడిని చేసి.. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వదించిన ఓ బ్రోకర్ హత్యకు గురయ్యాడు. సంబంధం చూసి పెళ్లి చేసిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.