అమెరికా మరో శక్తివంతమైన అణ్వస్త్ర సామర్థ్యం గల మినిట్‌మ్యాన్-3ని ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాన్డెన్‌బెర్గ్ స్పేస్ బేస్‌లో ఈ పరీక్ష జరిగింది. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ల వేగంతో.. 4,200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే మినిట్‌మ్యాన్ 3 క్షిపణి పరీక్ష సాధారణమైనదేనని.. ప్రస్తుత ప్రపంచ సంఘటనలకు ప్రతిస్పందన కాదని యూఎస్ సైన్యం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Trump: భారత్-పాక్ సమస్యను నేనే పరిష్కరించా.. ట్రంప్ మళ్లీ ప్రకటన
దేశవ్యాప్తంగా క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక చేస్తున్న సమయంలో.. అమెరికా వైమానిక దళం బుధవారం డూమ్స్‌డే క్షిపణి పరీక్ష నిర్వహించింది. అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM), మినిట్‌మ్యాన్ 3ని ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
ఇది కూడా చదవండి: Atchutapuram: పోలీసుల తనిఖీలు.. భారీ “సైబర్ డెన్” గుర్తింపు..!
మినిట్‌మ్యాన్-3లో అత్యంత శక్తిమంతమైన మార్క్-21 రీఎంట్రీ వెహికల్ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్ పేలోడ్‌ను అమర్చవచ్చు. గతంలో పలుమార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది. గతేడాది నవంబర్‌లో ఒకసారి పరీక్షించారు. మినిట్‌మ్యాన్-3 అమెరికా వాయుసేన అత్యంత నమ్మకమైన క్షిపణిగా భావిస్తోంది.
ఇదిలా ఉంటే భవిష్యత్‌లో అమెరికా భూభాగంలోకి ఏ క్షిపణి ప్రవేవించకుండా గోల్డెన్ డోమ్‌ను అమెరికా రూపొందిస్తోంది. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ.. ప్రపంచం నుంచి ఎటువైపు నుంచి క్షిపణులు వచ్చినా అడ్డుకోగలిగే సామర్థ్యం దీని సొంతం. ఇజ్రాయెల్‌కు ఐరెన్ డోమ్ ఉన్నట్లుగానే ఇప్పుడు అమెరికా చేతిలో గోల్డెన్ డోమ్ ఉంది. ఈ వ్యవస్థ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.15 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది. ఇది పూర్తి కావడానికి మూడేళ్లు పడుతోంది. అంటే ట్రంప్ పదవీకాలం ముగిసే నాటికి అందుబాటులోకి వస్తుంది.
At 12:01am on May 21, 2025, the U.S. Air Force Global Strike Command launched an LGM-30G “Minuteman III” Unarmed Nuclear-Capable Intercontinental Ballistic Missile (ICBM) equipped with a single Mark-21 High Fidelity Re-Entry Vehicle from Vandenberg Space Force Base, California.… pic.twitter.com/GaO0tb49bu
— OSINTdefender (@sentdefender) May 21, 2025