ప్రపంచ సుందరి-2025 పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. మరికాసేపట్లో మిస్ వరల్డ్ విజేతను ప్రకటించనున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, టాలీవుడ్, బాలీవుడ్, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం 3,500 మంది అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక న్యాయ నిర్ణేతలుగా నటుడు సోనూ సూద్, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లార్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: Elon Musk: 14 మంది కాదు అంతకు మించి, జపనీస్ పాప్ స్టార్‌తో మరో బిడ్డను కన్న ఎలాన్ మస్క్..
ప్రపంచ సుందరి 2025 కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు మొత్తం 108 దేశాల అందాల భామలు పోటీలో పాల్గొన్నారు. ఇందులో 16 మంది క్వార్టర్స్‌కు ఎంపికయ్యారు. చివరి రౌండ్‌లో అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఫైనల్‌కు వచ్చిన నలుగురిలో తుది ప్రశ్న ద్వారా న్యాయనిర్ణేతలు మిస్ వరల్డ్ విజేతను ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి: Kalpika: ప్రిజం పబ్‌లో హీరోయిన్ పై దాడి..
మిస్ వరల్డ్ విజేతను ఎలా ఎంపిక చేస్తారంటే..
మూడు దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఒక్కో ఖండం నుంచి 10 మందిని ఎంపిక చేస్తారు. అమెరికా, కరీబియన్స్ నుంచి 10 మంది, ఆఫ్రికా నుంచి 10 మంది, ఐరోపా నుంచి 10 మంది, ఏషియా, ఓషీనియా నుంచి 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ప్రతి ఖండం నుంచి ఎంపికైన 10 మంది నుంచి సెకెండ్ స్టేజ్‌లో ఐదుగురిని ఎంపిక చేయనున్నారు. మళ్లీ ఈ ఐదుగురిలో మూడో దశలో ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఇలా పోటీలో 8 మంది నిలువగా.. ఈ 8 మందిలో సెమీ ఫైనల్‌లో భాగంగా ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఒకరిని టాపర్‌గా ఫైనలైజ్ చేస్తారు. మిగిలిన నలుగురి మధ్య ఫైనల్ పోటీ జరగనుంది. ప్రస్తుతం ఫైనల్‌లో నలుగురు నిలిచారు.
నలుగురిలో ఏషియా, ఓషీనియా గ్రూప్ నుంచి భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందినీ గుప్తా ఉంది. యూరప్ ఖండం నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గర్హాట్, ఆఫ్రికా నుంచి నమీబియాకు చెందిన సల్మా కామనియా, అమెరికా కరీబియన్ గ్రూప్ నుంచి మార్టిన్‌కు చెందిన ఆరెలీ బోచిమ్ ఎంపికయ్యారు. గ్రాండ్ ఫినాలేలో ఈ నలుగురే పాల్గొంటారు. ఈ నలుగురిలోనే ఒకరిని మిస్ వరల్డ్ కిరీటం వరించనుంది. ఇక మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేయనున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, మెయిన్ స్పాన్సర్ల ద్వారా ఈ ప్రైజ్ మనీ అందించనున్నారు.
భారత్‌కు 6 సార్లు కిరీటం..
ఇక ఇప్పటి వరకు అత్యధిక సార్లు మిస్ వరల్డ్ కిరీటం ఇండియా, వెనిజులా దక్కించుకున్నాయి. భారత్‌కు ఆరు సార్లు మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లార్ సొంతం చేసుకున్నారు.
అలాగే వెనిజులా కూడా ఆరు సార్లు కిరీటం దక్కించుకుంది. యూకే 5 సార్లు, యూఎస్ఏ, సౌతాఫ్రికా చెరో 3 సార్లు కిరీటం సొంతం చేసుకున్నాయి. ఈసారి భారత్ గెలిస్తే మిస్ వరల్డ్ ఎక్కువ సార్లు గెలిచిన రికార్డు భారత్ సొంతం అవుతుంది.