Kavitha: రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన గ్రహచారం.. కవిత సంచలన వ్యాఖ్యలు
- రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
- నూతన జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మన గ్రహచారం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మన ఖర్మేందంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జై తెలంగాణ అని కూడా అనరు. మన గ్రహచారం బాగోలేక రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యమకారులపైకి గన్ పట్టుకుని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తోంది… ఆ రోజైనా అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించాలి. రేవంత్‌రెడ్డి.. పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. పక్క రాష్ట్రం ప్రాజెక్ట్‌లు కడుతుంటే.. ఏం చేస్తున్నారు.’’ అని నిలదీశారు.
‘‘జూన్ 2 రాజీవ్ యువ వికాసం పేరుతో పథకం ప్రారంభిస్తున్నారని తెలిసింది. పథకాలు.. తెలంగాణ యువ వికాసం పేరుతో ఉండాలి కానీ.. రాజీవ్ వికాసం పేరు మీద కాదు. తెలంగాణ కోసం పోరాడి.. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి నోటీసులిస్తారా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసు ఇస్తారా? కేసీఆర్‌కు నోటీసు ఇవ్వడంపై జూన్ 4న పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు చేపడుతున్నాం.’’ అని కవిత తెలిపారు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ఇది కూడా చదవండి: Operation Sindoor: భారత్‌కి వైమానిక నష్టాలు ఉన్నాయి.. పాక్‌లోకి వెళ్లి దాడులు చేశాం: సీడీఎస్..
శనివారం సాయంత్రం తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కవిత వెంట భర్త ఉన్నారు. భర్తతో కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Kalpika: ప్రిజం పబ్‌లో హీరోయిన్ పై దాడి..
నూతన కార్యాలయంలో కేసీఆర్, కవిత ఫొటోలు ప్రత్యేకంగా పెట్టారు. ఇక తెలంగాణ జాగృతి బ్యానర్‌లో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే కార్యాలయంలో బీఆర్. అంబేద్కర్, జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!